నా రెండో పెళ్లి విషయంలో తన తప్పు లేదు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-29 14:19:08  IST  )

శోభిత పట్ల నాకు చాలా జాలిగా ఉంది. తను ఏ తప్పూ చేయకపోయినా, నెటిజన్లు తనపై అన్యాయంగా నెగెటివిటీని పెంచారు. ఆ సమయంలో తను పడిన బాధను చూసి నేను కూడా చాలా వేదనకు గురయ్యాను

నా రెండో పెళ్లి విషయంలో తన తప్పు లేదు..  నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత తమ వ్యక్తిగత జీవితాల్లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకోగా... సమంత గత ఏడాది డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరును ఈషా ఫౌండేషన్‌లో రహస్యంగా వివాహం చేసుకుంది. అయితే నాగచైతన్యతో పెళ్లి సమయంలో శోభితపై చాలా నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే. తాను సమంత జీవితాన్ని నాశనం చేసిందని దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికీ సమంత అభిమానులు శోభితను ఏదో రకంగా తిడుతూనే ఉన్నారు. ఇక వాటిపై నాగచైతన్య ఇప్పటికే ఎన్నోసార్లు స్పందించగా.. ఇప్పుడు మరోసారి తన బాధను వ్యక్తపరిచాడు. తాజాగా, సోషల్ మీడియాలో శోభితపై వస్తున్న విమర్శలు, నెగెటివిటీపై నాగచైతన్య స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ బంధం గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. శోభితను అన్యాయంగా విమర్శించడం పట్ల చాలా బాధగా ఉందని తెలిపాడు.

తన రెండో పెళ్లి విషయంలో ఆమెను నిందించడం సరికాదని, ఇందులో ఆమె తప్పు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశాడు. "శోభిత పట్ల నాకు చాలా జాలిగా ఉంది. తను ఏ తప్పూ చేయకపోయినా, నెటిజన్లు తనపై అన్యాయంగా నెగెటివిటీని పెంచారు. ఆ సమయంలో తను పడిన బాధను చూసి నేను కూడా చాలా వేదనకు గురయ్యాను" అని చైతన్య పేర్కొన్నాడు. తమ మధ్య చిగురించిన ప్రేమ గురించి వివరిస్తూ.. తాము మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నట్లు చైతన్య వెల్లడించారు. కాలక్రమేణా ఒకరినొకరు అర్థం చేసుకుని, తమ బంధాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు తీసుకెళ్లామని చెప్పారు. ఎంతో పారదర్శకంగా తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, బయట వ్యక్తులు చేస్తున్న కామెంట్లు తనను ఎంతగానో బాధించాయని ఆయన అన్నారు. మొత్తానికి, అటు సమంత, ఇటు నాగచైతన్య ఇద్దరూ గత చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి, తమకు నచ్చిన భాగస్వాములతో సంతోషంగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను పక్కన పెట్టి, ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు.

Read More... యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్.. సంచలనంగా మారిన పోస్ట్

Next Story