యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్.. సంచలనంగా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

ప్రస్తుతం వీరిద్దరూ తమ బంధాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, త్వరలోనే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్.. సంచలనంగా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా హాట్ టాపిక్‌గా మారింది. వరుస ప్లాపుల తర్వాత మళ్ళీ హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', ‘టాక్సిక్’, ‘జన నాయగన్’ వంటి క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో.. తాజాగా పూజా హెగ్డే ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉందని, వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు ప్రధాన కారణం వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలే. వీరు కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, షికార్లు చేయడం వంటివి మీడియా కంట పడటంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పూజా, రోహన్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ, కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పడిన పరిచయం వీరిద్దరినీ ప్రేమ దిశగా నడిపించిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరూ తమ బంధాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, త్వరలోనే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. డేటింగ్ గురించి వస్తున్న ఈ వార్తలపై పూజా హెగ్డే కానీ, రోహన్ మెహ్రా కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ, వీరిద్దరి కెమిస్ట్రీకి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం పూజా హెగ్డే తన వ్యక్తిగత జీవితం గురించి త్వరగా స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచినప్పటికీ, పూజా హెగ్డే మాత్రం తన కెరీర్‌ను అస్సలు తగ్గించడం లేదు. విభిన్న భాషల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం గమనార్హం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆమె చేస్తున్న చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేయబోతుందా? లేక ఇవన్నీ కేవలం రూమర్లేనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా, పూజా హెగ్డే ఈ విషయంపై క్లారిటీ ఇస్తే తప్ప ఈ వార్తలకు చెక్ పడేలా లేదు.

Next Story