- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నీ భర్త నిన్ను అత్యాచారం చేస్తున్నాడు.. ముందు నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకో..

మేడమ్! మాకు పెళ్లై ఒకటిన్నర ఏడాది అవుతోంది. ఒక బాబు, ప్రసవం అయిన తర్వాత వెజైనాకు కుట్లు పడ్డాయి. 45 రోజులు గడిచిన తర్వాత మేం శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. మావారు దగ్గరికి వస్తే వణికిపోతున్నాను. ఆయనేమో వినరు. బలవంతం చేస్తారు. ఆ తర్వాత రోజు అసలు నడవలేకపోతున్నాను. ఇంటిపని, పసిబిడ్డను చూసుకోవడం అస్సలు చేతకావడం లేదు. సెక్సులో పాల్గొనే కొద్దీ అదే తగ్గిపోతుందిలే అంటారాయన. శృంగారం అన్నా, నా పరిస్థితి అర్థం చేసుకోని ఆయనన్నా ఇష్టం లేకుండా పోతోంది. మళ్లీ పుట్టింటికి వెళ్లిపోవాలని ఉంది. ఆయన్నుంచి తప్పించుకోవడానికి అదొక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఇదే మాట ఆయనతో అంటే 'వెళ్లు, నాకు వేరే మార్గాలు లేవా' అంటూ అసహ్యంగా మాట్లాడతారు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటూ బెదిరిస్తారు. ఈ నొప్పి, ఆయన బ్లాక్ మెయిలింగ్ భరించలేక చాలా విరక్తిగా ఉంది. ఏ చేయాలి? మేం పల్లెటూళ్లో ఉంటాం. మగ డాక్టరు దగ్గరికి వెళ్లాంటే సిగ్గుగా ఉంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.
రేణుకా! ముందు మీరు వెళ్లాల్సింది పుట్టింటికి కాదు. లేడీ డాక్టరు దగ్గరికి. చాలామందికి మొదటి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చే వెజైనా ద్వారం చీరుకుపోతుంది. అలాగే బిడ్డ తల రెండు పెల్విక్ బోన్స్ మధ్య ఇరుకున్నప్పుడు సులువుగా శిశువు బయటకు రావడానికి వెజైనా ద్వారాన్ని కత్తెరతో కొద్దిగా కత్తిరించి వెడల్పు చేయటం, ఆ తర్వాత కుట్టు వేయడం చేస్తారు. దీన్ని ఎపిసియోటోమి అంటారు. ఇది 15 లేదా 20 రోజుల్లో పూర్తిగా మానిపోతుంది. అయితే కొంతమందిలో అంటే సరిగా విశ్రాంతి తీసుకొని, మందులు వాడని, పరిశుభ్రత పాటించని వాటిలో ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుంది. దీనివల్ల ఆ ప్రదేశంలో వాపు, నొప్పి ఉంటాయి. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా దగ్గర్లో పట్టణానికి వెళ్లి మంచి డాక్టరుకి చూపించుకోండి.
ఇక మీవారి సంగతి!అతని ప్రవర్తన మనిషి ప్రవర్తన లాగా లేదు. భార్య నొప్పితో విలవిల్లాడుతుంటే సెక్సులో తన సుఖాన్ని మాత్రమే చూసుకుంటూ, సహకరించకపోతే పరాయి స్త్రీల దగ్గరకి వెళ్తానని బెదిరించడం చాలా హీనమైన ప్రవర్తన. గర్భ సమయంలో ప్రసవం తర్వాత భార్య కూడా శృంగారానికి దూరంగా ఉంటుంది. భర్తకి బీపీ, షుగరు లాంటి అనారోగ్యాలు వస్తే మునపటిలా శృంగారంలో భార్యను సంతృప్తి పరచలేరు. అలాంటప్పుడు భార్య కూడా ఇలాగే భర్తను బ్లాక్‌మెయిల్ చేస్తోందా? నీతి సూత్రాలు అందరికీ వర్తిస్తాయి. ఇలాగే బెదిరించి పరాయి స్త్రీల దగ్గరకు వెళితే పుట్టెడు సుఖ రోగాలతో నరకయాతన అనుభవించాల్సి వస్తుందని చెప్పండి. మీకు భరించలేని నొప్పి ఉందన్నా సరే మీ భర్త శృంగారం బలవంతంగా చేస్తూ మిమ్మల్ని లైంగిక అత్యాచారం (మ్యారిటల్ రేప్) చేస్తున్నాడు.
ముందు మీరు టౌన్‌లో మంచి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకొని తగ్గేదాకా మందులు వాడండి. నొప్పి తగ్గే వరకు శృంగారం విషయంలో మిమ్మల్ని ఒత్తిడి చేయొద్దని కచ్చితంగా చెప్పండి. నొప్పి, బాధ, అసౌకర్యం లేకుండా భర్తతో శృంగారంలో పాల్గొనడం మీ హక్కు. బెదిరిస్తే లొంగే ప్రస్తక్తే లేదని, ప్రసవం తర్వాత, బహిస్టు సమయంలో, హిస్టెరెక్టమీ తరువాత, తీవ్రమైన మెనోపాజ్ దశలో, అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి, బాధ ఉన్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా మనోవేధన, మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా సెక్సు కోరికలకు వాడుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని చెప్పండి. అప్పటికీ పట్టించుకోకపోతే, మీకు సహకరించకపోతే మూడు నెలల పాటు మీ పుట్టింటికి వెళ్లిపోండి. మీ తల్లిగారితో విషయం చెప్పి మంచి డాక్టర్ని కలిసి చికిత్స తీసుకోండి.
అవసరమైతే గైనకాలజిస్టుతోనే మీ భర్తకు చెప్పించండి. శృంగారంలో కొన్నాళ్లు పాల్గొనకూడదని కఠినంగా చెప్పమనండి. ప్రసవాలు చేయడం, భర్తల ద్వారా వచ్చే సుఖ వ్యాధులను అధ్యయనం చేయడంతోపాటు వాటికి కారణమైన భర్తలకు ఇటువంటి ఫీమేల్ ఓరియంటెడ్ కౌన్సెలింగ్ చేయడం కూడా గైనకాలజిస్టులు, సెక్స్ థెరపిస్టులు, మానసిక వైద్యుల బాధ్యత. ఎందుకంటే శృంగారపరమైన అత్యాచారాలు, సుఖరోగాలు అంటించడం కూడా గృహహింసలో భాగమే. ఆరోగ్యవంతమైన భార్యల జీవితాలను సమస్యల్లోకి నెట్టడం కూడా నేరమే.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్
Read More :
పెళ్లై ఏడాది.. 10 సార్లకంటే ఎక్కువ సెక్స్‌లో పాల్గొన లేదు.. నా భర్తను మార్చుకునేది ఎలా..?