హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి రామయ్యకు ముంపు తప్పదా?

by Batti.Sumithra |

పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలం రెవెన్యూ నియోజకవర్గంలో ఎంత మేరకు ముంపు ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు బుధవారం సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాలలోని పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.

హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి రామయ్యకు ముంపు తప్పదా?
X

పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలం రెవెన్యూ నియోజకవర్గంలో ఎంత మేరకు ముంపు ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు బుధవారం సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాలలోని పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. కనీసం వారం రోజుల పాటు సర్వే నిర్వహిస్తారాని భావించినా... కేవలం ఒక్కరోజు మాత్రమే సర్వే చేసి మమ అనిపించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు ఉమ్మడి సర్వేలో ఎం తేలింది..? ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయో తెలియకుండా పోయింది. పోలవరం బ్యాక్ వాటర్‌పై వెంటనే స్పందించకపోతే... భద్రాద్రి ఏజెన్సీలో ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు భద్రాద్రి రామాలయం, హెవీ వాటర్ ప్లాంట్ నీట మునగక తప్పదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, భద్రాచలం : పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలం రెవెన్యూ నియోజకవర్గంలో దాదాపు 900 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు 15 రెవెన్యూ గ్రామాలకు ముంపు తప్పేలా లేదు. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్ట్ ముంపు సర్వే నిర్వహించడానికి బుధవారం సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఈ మేరకు భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాలలోని పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. కనీసం వారం రోజుల పాటు సర్వే నిర్వహిస్తారాని భావించినా... కేవలం ఒక్కరోజు మాత్రమే సర్వే చేసి మమ అనిపించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయు. అసలు ఉమ్మడి సర్వేలో ఎం తేలింది..? ఏయే ప్రాంతాలు ముంపునకు గురవుతాయో బహిరంగంగా తెలపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ (150అడుగులు) పూర్తయితే భద్రాచలంలో 365రోజులు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు పైబడి గోదావరి ఉంటుందని ప్రవహిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం గోదావరి 38.5 అడుగులకు చేరుకున్న వెంటనే అధికారులు కరకట్ట స్లుయుజ్‌లు మూసి వేస్తారు. దీంతో భద్రాచలం పట్టణంలో కురిసిన వర్షపు నీరు గోదావరిలో కలిసే అవకాశం లేదు. బాహుబలి మోటార్ల ద్వారా వరద నీరు గోదావరిలోకి పంప్ చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత.. ఎప్పుడూ 43అడుగుల మేర గోదావరి ఉండటంతో, స్లుయుజ్ లు తెరిచే అవకాశం లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా.. మోటార్లకు పని చెప్పాల్సిందే. లేకపోతే వరద నీటితో రామాలయంతో పాటు పలు కాలనీలు ముంపు బారిన పడుతాయి. అలాగే కిన్నెరసాని, గుబ్బలమంగి నదుల కింద ఉన్న 8 చెరువులు పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా ఉప్పొంగి వ్యవసాయ భూములు ముంపునకు గురి కావడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచే అవకాశం ఉంది. గోదావరి ప్రవాహం 70అడుగులు దాటినప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో ముంపు పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే పోలవరం బ్యాక్ వాటర్ ద్వారా ముంపుకు గురికాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే... భద్రాద్రి ఏజెన్సీలో ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయం, హెవీ వాటర్ ప్లాంట్ నీట మునగక తప్పదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హెవీ వాటర్ ప్లాంట్ ముంపుపై స్పష్టత కరవు

భారత దేశానికే గర్వకారణం అయిన అశ్వాపురంలోని భారజల కర్మాగారం కూడా పోలవరం ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందని కొందరు విశ్రాంత ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అయితే సీడబ్ల్యూసీ, పీపీఏ ఉమ్మడి సర్వేలో హెవీ వాటర్ ప్లాంట్ ముంపుపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పరిశ్రమ యాజమాన్యం నిజాలు తెలపాలని కోరడంతో ఉమ్మడి సర్వే అధికారులు ముంపునకు గురికాదని స్పష్టత లేని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కాగా బుధవారం నిర్వహించిన పోలవరం బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వేలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సి ఈ ఓ సంజీవ్ వోహ్ర, రఘురామ్, రమేష్, సతీష్, డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story