పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు రియాక్షన్

by Prasad Jukanti |

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రామచందర్ రావు స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను వాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు రియాక్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మీ అయ్య జాగీరా అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. పవన్ కల్యాణ్ ఆ మాట అన్నట్లు వినలేదన్నారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ మంత్రి ‘తెలంగాణ తన జాగీరు’ అని మాట్లాడినట్లు విన్నానన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం ఎందుకు అని ప్రశ్నించారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు రెండు పార్టీలు తెలంగాణ సెంటిమెంట్‍ను మళ్లీ తీసుకొస్తున్నాయన్నారు. పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇస్తే ఏమయ్యేదని నిలదీశారు. ఈ అంశాన్ని బీజేపీ మీద ఎందుకు రుద్దుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.

బీజేపీనే సూపర్ హీరో:

తెలంగాణ బీజేపీని భూతంలా చూపిస్తున్నారని కానీ తెలంగాణకు నిజమైన భూతాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ శక్తిగా ఎదిగిందని సౌత్ ఇండియాలో బీజేపీకి తెలంగాణ గేట్ వే అన్నారు. తెలంగాణలో బీజేపీనే సూపర్ హీరో అని చెప్పారు. తెలంగాణ పోరాట జేఏసీలో బీజేపీ భాగస్వామిగా ఉందని జేఏసీలో లేనిది కాంగ్రెస్సే అన్నారు. ఉద్యోగ నియామకాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని, పుష్కర కాలంలో నీళ్లమీద ఒక పాలసీ లేదన్నారు. కృష్ణాజలాలలను కర్ణాటకకు మళ్లీస్తున్నారని విమర్శించారు. బండి భగీరథ ఇష్యూతో బీజేపీకి సంబంధం లేదని చెప్పారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి ఆర్వింద్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు బాగానే ఉన్నారన్నారు.

Next Story