- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి పనికి ఓ రేటు.. కాదంటే లేటు
ఆ మండల కార్యాలయం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉంది. అదే పట్టణంలో జిల్లా అధికార యంత్రాంగం తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

దిశ, నల్లగొండ బ్యూరో : ఆ మండల కార్యాలయం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉంది. అదే పట్టణంలో జిల్లా అధికార యంత్రాంగం తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అయినప్పటికీ ఆ మండల కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. పిల్లల విద్యాభ్యాసం కోసం ఉపయోగపడే ఏ రకమైన సర్టిఫికెట్ నుంచి రైతుల భూముల రిజిస్ట్రేషన్ వరకు పనికి ఓ రేటు నిర్ణయించి దాని ప్రకారం డబ్బులు వసూలు చేయడం నిత్య కృత్యమైపోయింది. ఈ పనిలో కార్యాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి హస్తం ఉన్నట్లు సమాచారం.
ఆ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు..
నల్లగొండ రెవెన్యూ కార్యాలయంలో అవినీతి అక్రమాలకు అడ్డగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దాని ప్రకారం డబ్బులు వసూలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రెవెన్యూ కార్యాలయం నుంచి కులం, ఆదాయం, రెసిడెన్షియల్, ఫ్యామిలీ, డెత్, బర్త్డే భూమి పహాణీ సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఆ సందర్భంలో అధికారులు లేని లిటిగేషన్లు పెడుతూ కార్యాలయానికి వస్తున్న వారిని ఇబ్బందుల గురి చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. కార్యాలయంలో రెవెన్యూ అధికారులు చేస్తున్న సొమ్ము ఇలా ఉన్నట్లు తెలుస్తోంది.
డెత్ సర్టిఫికెట్....రూ. 2000--3000
బర్త్ డే సర్టిఫికెట్.... రూ. 1000--2000
ఫ్యామిలీ సర్టిఫికెట్...రూ.3000--4000
భూ రిజిస్ట్రేషన్.... రూ. 5000--10,000
కుల, ఆదాయ, రెసిడెన్షియల్
సర్టిఫికెట్..... రూ. 300--500
భూమి పహాణీలు...... రూ. 500--1000
కల్యాణలక్ష్మి......రూ. 5,000--10,000
ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం...?
నల్లగొండ రెవెన్యూ కార్యాలయంలో ప్రైవేట్ సిబ్బంది దళారుల హవా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కింద ప్రైవేటు వ్యక్తి, భూ రికార్డుల వద్ద, భూ రిజిస్ట్రేషన్లు, కళ్యాణ లక్ష్మి లతో పాటు ప్రతి సెక్షన్లో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సాగుతుంది. ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వక పోయినట్లయితే ఏదో ఒక టెక్నికల్ సాకు చూపించి ఆ పనిని వాయిదా వేస్తూ రోజుల తరబడి కార్యాలయం చుట్టూ పదేపదే తిప్పించుకుంటారని విమర్శలు ఉన్నాయి. "" ఇటీవలే ఓ వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం కావాలని వెళితే ఆధార్ కార్డులో స్థానిక అడ్రస్ లేదు కాబట్టి రూ. 6వేలు ఇస్తే తప్ప మీ సర్టిఫికెట్ ఇవ్వలేమని రెవెన్యూ అధికారి ఖరాకండిగా చెప్పినట్లు తెలిసింది "" ఓ రెవెన్యూ అధికారి పూర్తిగా కార్యాలయ అధికారుల కనుసన్నలలో నే జరుగుతున్నట్లు తెలుస్తోంది . ఒకవేళ అదే జరగకపోతే ప్రైవేటు వ్యక్తులను కార్యాలయంలోకి రానివ్వకుండా చర్యలు తీసుకునేవారు. అయితే ఈ డబ్బులు వసూళ్లు కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే తీసుకొని సాయంత్రం వరకు ఎవరి వాటా వాళ్లు పంపిణీ చేసుకొని వెళ్తారనే ప్రచారం జరుగుతుంది.
రెవెన్యూ ఆఫీస్ పై ఏసీబీ దృష్టి...?
నల్గొండ మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జరుగుతున్న అక్రమాలు పూర్తిగా అధికారుల అండ దండల తోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ రెవెన్యూ కార్యాలయం పై దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి ప్రజలను పీడించడం మానుకోవాలని కోరుకుంటున్నారు.






