- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ కార్డుదారులు పనులకు హాజరు కావాలి : గుమ్మడి సోమయ్య
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేసుకోవాలంటే వంద రోజుల పనుల కోసం ఉపాధి హామీ కార్డులు పొందిన వారంతా పనులకు తప్పని సరిగా హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు.

దిశ, మంగపేట : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేసుకోవాలంటే వంద రోజుల పనుల కోసం ఉపాధి హామీ కార్డులు పొందిన వారంతా పనులకు తప్పని సరిగా హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉమ్మన్న కుంట చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కూలీలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా కూలీలకు చల్లని మజ్జిగ అందించి వారి కష్టసుకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి కార్డులు పొందిన వారంతా ప్రతి రోజు వంద రోజుల పనికి హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి 40 శాతం నిధులు రావడం వల్ల గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి అభివృద్ధి చేసుకోవచ్చాన్నారు. కూలీలు తప్పని సరిగా పనులకు హాజరై గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, పెద్ది నర్సింహా రావు, భగవాన్ రెడ్డి, మల్లయ్య, మహబూబ్ ఖాన్, మండవ రామకృష్ణలు పాల్గొన్నారు.






