హీరోలకి, హీరోయిన్లకు అసలు పోలికే లేదు.. రెమ్యునరేషన్ వివక్షపై కాజల్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో హీరోలకి, హీరోయిన్లకి ఇచ్చే పారితోషికంలో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు సినిమా రంగం చాలా వరకు కార్పొరేట్ స్టైల్‌లోకి మారడం వల్ల పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి.

హీరోలకి, హీరోయిన్లకు అసలు పోలికే లేదు.. రెమ్యునరేషన్ వివక్షపై కాజల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సెకండ్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్‌లో చాన్స్ దక్కించుకున్న ఆమె షూటింగ్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజెంట్ కాజల్ రామాయణ, ది ఇండియన్ స్టోరీ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలోనే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం విషయంలో ఇంకా చాలా మార్పులు రావాలని అంటోంది. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల రెమ్యూనరేషన్ మధ్య ఉన్న తేడాల గురించి కాజల్ మాట్లాడుతూ.. "ఈ వివక్షపై ఇంకా చాలా మంది నటీనటులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీలో హీరోలకి, హీరోయిన్లకి ఇచ్చే పారితోషికంలో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు సినిమా రంగం చాలా వరకు కార్పొరేట్ స్టైల్‌లోకి మారడం వల్ల పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి, కానీ ఇప్పటికీ ఇద్దరి జీతాల మధ్య పోలికే లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను తల్లి అయిన తర్వాత జీవితంలో ప్రాధాన్యతలు మారినట్లు వెల్లడించారు. "అమ్మనయ్యాక షూటింగ్‌లు చేయడం మరింత సవాలుగా మారింది. పని ముగించుకుని త్వరగా ఇంటికి వెళ్లాలనిపిస్తుంది. అందుకే నేను రోజుకు ఒకే షిఫ్ట్, అంటే కేవలం 9 గంటలు మాత్రమే పని చేస్తానని నా అగ్రిమెంట్‌లో ముందే రాసి పెట్టుకుంటాను. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం అటు ఇటుగా మారినా.. వీలైనంత వరకు ఫిక్స్‌డ్ టైమింగ్స్ పాటిస్తాను" అని తెలిపారు. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ, సమయపాలన చాలా బాగుంటాయని నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలను కాజల్ పూర్తిగా సమర్థించింది. "అది నిజమే. సౌత్‌లో ఎవరూ 9 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయించుకోరు. నా కెరీర్ ఇక్కడే స్టార్ట్ కావడం వల్ల నాకు సౌత్ ఇండస్ట్రీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. బాలీవుడ్‌లో లేని కంఫర్ట్, పంక్చువాలిటీ ఇక్కడ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మహిళలకు చాలా గౌరవం ఇస్తారు" అని ప్రశంసలు కురిపించారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story