- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.5 లక్షల ఆస్తి నష్టం
by Batti.Sumithra |
చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, చేగుంట : చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మ బాలయ్య నివాస గృహంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంటిలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని రామాయంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అనంతరం ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Next Story






