- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నైరుతి ఆగమనానికి వేళాయె.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరికొద్దిగంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రాకకు వాతావరణం అనుకూలించడంతో.. రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్దిగంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రాకకు వాతావరణం అనుకూలించడంతో.. రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో మరో మూడుగంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత.. అవి క్రమంగా తమిళనాడు వైపు కదిలే సూచనలు ఉండటంతో.. వెస్ట్, సౌత్ తమిళనాడులోని 15 జిల్లాలకు కూడా భారీ వర్షసూచన చేసింది. జూన్ 1వ తేదీకే కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేసినప్పటికీ.. వాతావరమం అనుకూలించకపోవడంతో కాస్త ఆలస్యమైంది. మరోవైపు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ద్రోణి విస్తరించి ఉండటంతో ఏపీలో నాలుగురోజులపాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నేడు తెలంగాణలో..
నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సిద్ధిపేట, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. వెస్ట్, సెంట్రల్, సౌత్ హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారుతుందని, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.






