- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
పెళ్లై ఏడాది.. 10 సార్లకంటే ఎక్కువ సెక్స్‌లో పాల్గొన లేదు.. నా భర్తను మార్చుకునేది ఎలా..?

మేడమ్! నా వయస్సు 27 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం అవుతోంది. నా భర్త వయస్సు 30 సంవత్సరాలు. సంవత్సరంలో మేము 10 సార్లకంటే ఎక్కువ సెక్స్‌లో పాల్గొన లేదు. ఆయన ఎప్పుడూ ఆసక్తి లేనట్లే ఉంటారు. సెక్స్ చేసినప్పుడు కూడా క్షణాల్లో ముగిసిపోతుంది. మామూలు సందర్భాల్లో కూడా చాలా మూడీగా ఉంటాడు. ఈ విషయం మా అత్తగారితో, ఆడబిడ్డతో కూడా చర్చించాను. వాళ్లు ఆయన్ని మందలించారు. అయినా, ఫలితం లేదు. నాకు సెక్స్ పెద్ద ముఖ్యం కాదు. కానీ అతనింత అసాధారణంగా, అసహజంగా ఎందుకుంటున్నారన్నదే నన్ను వేధిస్తున్న సమస్య. నన్నేం చేయమంటారు?
సెక్స్‌లో ఆసక్తి లేకపోవడానికి చాలా కారణాలుంటాయి. నిజానికి కొత్తగా పెళ్లైన నూతన దంపతులు రోజుకు మూడు, నాలుగు సార్లన్న సెక్స్‌లో పాల్గొంటుంటారు. కారణం పురుషుడిలో సెక్స్ హార్మోన్ల ఉధృతి ఎక్కువగా ఉండడమే. అయితే , కాలం గడిచే కొద్దీ ఈ ఫ్రీక్వేన్సీ తగ్గుతూ వస్తుంది. రోజుకు ఒకసారి, వారానికి మూడుసార్లు వారానికి ఒకసారి, నెలలో నాలుగు సార్లు ఇలా అయితే దీనికి కారణాలు కొత్తదనం తగ్గడం, జీవితంలో బిజీ అయిపోవడంగా చెప్పవచ్చు. ఇక మీ భర్త సమస్యకు వస్తే చాలా కారణాలు ఉంటాయి. మీరిద్దరూ కలసి సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్తే ఆ కారణాలను విశ్లేషించి మనో లైంగిక చికిత్స ఇస్తారు.
కొన్ని కారణాలు
• సెక్స్ పట్ల అపోహలు, అయిష్టత
• వీర్యం నష్టం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్న తప్పుడు నమ్మకం. ఒక వీర్యం చుక్క వంద రక్తపు చుక్కలంత బలమైందన్న అశాస్త్రీయమైన మూఢనమ్మకం.
• సెక్స్ అంటే అపవిత్రమైందని, అసహ్యకరం, పాపకరమైందని విశ్వసించడం.
• త్వరగా తండ్రి కావడం ఇష్టం లేకపోవడం.
• ఆర్థిక, కుటుంబ సమస్యలు.
• ఇంట్లో పెళ్లికి ఎదిగిన అక్కలు, చెల్లెళ్లు ఉండటం.
• ఇంట్లో ప్రత్యేక గది లేకపోవడం.
• డిప్రెషన్, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం.
• శీఘ్రస్కలనం లాంటి సెక్స్ సమస్యలు.
• తన అంగం సైజు చిన్నదనే నమ్మడం, అది చూసి భార్య వెటకారం చేస్తుందనే అసంతృప్తికి లోనవుతుందనో భయపడటం.
• శారీరకంగా అవయవ లోపం, అంద వికారం ఉండటం.
• బాల్యంలో పురుషులతో లైంగిక అత్యాచారాలకు లోనవడం.
• తన లైంగిక సామర్థ్యం మీద నమ్మకం లేకపోవడం.
• టీనేజీలో అంకురించిన 'మేల్ టు మేల్ అట్రాక్షన్' అంటే అందమైన పురుషుల పట్ల కలిగే ఆకర్షణ.
• హోమూ సెక్సువల్‌గా మారడం, ఒక పార్టనర్‌ని ప్రేమిస్తూ సంబంధంలో ఉండటం. లోకం కోసం, పిల్లల కోసం స్త్రీని పెళ్లి చేసుకోవడం, ఏక కాలంలో సంబంధాలు నెరపడం. ఇలాంటి సంబంధంలో భార్యతో అతి తక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం.
• అతి హస్తప్రయోగానికి అలవాటు పడటం వల్ల, ఉదా: రోజుకు కనీసం 6-8 సార్లు సంవత్సరాల తరబడి తన చేతి స్పర్శ ఊహలకి మాత్రమే అగస్తంభన రావడం, భార్యను ముట్టుకున్నా రాకపోవడం, భార్యపై కోరిక తగ్గడం లాంటివి జరుగుతాయి.
• పోర్న్ సైట్స్ చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటు పడటం కూడా వ్యసనంలా మారి భార్యపై కోరిక తగ్గుతుంది. ఇది ఎక్కువగా ఐటీ ఫీల్డ్‌లో నైట్ షిఫ్ట్స్ చేసే పురుషుల్లో కనిపిస్తుంది.
• ప్రేమలో వైఫల్యం చెంది ప్రియురాలిని మరవలేనితనం వల్ల భార్యపై కోరిక తగ్గడం జరుగుతుంది.
• సెక్స్ హార్మోన్స్ అయిన టెస్టోస్టీరాన్ లెవల్స్ తగ్గడం వల్ల కూడా కోరిక తగ్గుతుంది.
• చాలా సాంప్రదాయబద్ధంగా దేవుడు, భక్తీ, పూజలు, పురస్కారాల మధ్య పెరిగిన కుటుంబంలో వ్యక్తులకు ఇటువంటి సమస్యలు ఉంటాయి.
వీటిలో ఏ కారణమూ సెక్సాలజిస్ట్ మీ భర్తను ఇంటర్వ్యూ చేశాక చెప్తారు. మీ భర్తకు కౌన్సెలింగ్, సైకో థెరపీ, మెరైటల్, సెక్స్ థెరపీలు అవసరం అవుతాయి. అధైర్యపడక మీ భర్తను తీసుకొని సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్లండి. మీకు మీ అత్తా ఆడబిడ్డల సపోర్టు ఉంది. కాబట్టి, పరిష్కారం మరింత సులువుగా అవుతుంది. అవసరమైతే మీ భర్తకు సెక్స్ హార్మోన్స్, వీర్య పరీక్షలూ చేయించండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్