చెరువుకొమ్ముపాలెంలో తీవ్ర విషాదం.. మాజీ సీఎం దిగ్భ్రాంతి

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు...

చెరువుకొమ్ముపాలెంలో తీవ్ర విషాదం.. మాజీ సీఎం దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం(Ongole Mandal) చెరువుకొమ్ముపాలెం(Cheruvukommupalem)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరణించిన పిల్లలందరూ 15 ఏళ్ల లోపు వయసు వారే కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. కళ్లడ్లముందే కానరాని లోకాలకు వెళ్లిన బిడ్డలను చూసి తల్లిదండ్రులు వేస్తున్న రోదనలు స్థానికులను కన్నీటిపర్యంతం చేస్తున్నాయి.

ఈ ఘోర ప్రమాదంపై..

ఈ ఘోర ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన చెందారు. నూరేళ్ల జీవితం ముందే ఉన్న పిన్న వయస్కులు ఇలా అనంత వాయువుల్లో కలిసిపోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల దుఃఖం తీరనిది..

కడుపుకోతతో అల్లాడిపోతున్న ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఃఖం తీరనిదని, తమ గారాల పట్టీలను కోల్పోయిన ఆ కుటుంబాల బాధను వర్ణించలేమని వైఎస్ జగన్ అన్నారు. బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరణించిన చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని జగన్ ఆకాంక్షించారు.

Next Story