టాలీవుడ్ లో ముదురుతున్న మాటల యుద్ధం

by Muthe.Rajitha |   (  Updated:2026-06-04 12:48:10  IST  )

పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, దానికి టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఇచ్చిన కౌంటర్ తో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

టాలీవుడ్ లో ముదురుతున్న మాటల యుద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, దానికి టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఇచ్చిన కౌంటర్ తో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామంపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ "మీరొస్తానంటే మేమొద్దంటామా? "రండి దొర.. కానీ పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్‌గా వస్తున్నారా అది చెప్పి రండి" అంటూ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్విట్టర్ (X) వేదికగా ఘాటు పోస్ట్ పెట్టారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. సమాజంలో జరిగే ప్రతి అంశంలోనూ ప్రకాశ్ రాజ్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి మీరేమైనా జిల్లా కలెక్టరా లేక దేశ ప్రధాని అనుకుంటున్నారా? అంటూ బండ్ల గణేశ్ ప్రశ్నించారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య చోటుచేసుకున్న ఈ 'ట్విట్టర్ వార్' తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరింత వేడిని రగిల్చింది.

Next Story