అడ్డగోలుగా అక్రమ వెంచర్ !

by Batti.Sumithra |

మర్రిగూడ మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటంతో ధరలు వీపరితంగా పెరిగాయి.

అడ్డగోలుగా అక్రమ వెంచర్ !
X

మర్రిగూడ మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటంతో ధరలు వీపరితంగా పెరిగాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. మండలంలోని తమ్మడపల్లిలో సర్వే నంబర్ 80లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే వెంచర్ అభివృద్ధి పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి వ్యవసాయ భూములను వెంచర్‌గా మార్చడమే కాకుండా, గ్రామకంఠం భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంచర్ లో పురాతన బురుజు, గ్రామంలో మైసమ్మ బాలమ్మ దేవాలయాలను నేలమట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేయడంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని గ్రామ పురాతన దేవాలయాలను, గ్రామకంఠం భూమిని రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

దిశ, మర్రిగూడ : రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిగూడ మండలంలోని భూములకు రెక్కలు వచ్చాయి. రియాల్టర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. నిబంధనలకు అనుకూలంగా వెంచర్లు ఏర్పాటు చేయాలన్నా ఇంకిత జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ప్రతిపాదిత రియల్ ఎస్టేట్ వెంచర్ పనులు వివాదాస్పదంగా మారాయి. సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే వెంచర్ అభివృద్ధి పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి వ్యవసాయ భూములను వెంచర్‌గా మార్చడమే కాకుండా, గ్రామకంఠం భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు అవుతున్న వెంచర్లో పురాతన బురుజు, గ్రామంలో మైసమ్మ బాలమ్మ దేవాలయాలను నేలమట్టం చేయడంతో పాటు గ్రామకంఠం భూమి సైతం ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేయడంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని గ్రామ పురాతన విమానాలను దేవాలయాలను గ్రామకంఠం భూమిని రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తమ్మడపల్లిలో అక్రమంగా వెంచర్ నిర్మాణం పనులు..

తమ్మడపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో భారీ స్థాయిలో వెంచర్ నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సాధారణంగా వ్యవసాయ భూమిని వెంచర్‌గా అభివృద్ధి చేయాలంటే నాలా కన్వర్షన్, డీటీసీపీ, హెచ్ఎండీఏ తదితర అనుమతులు తప్పనిసరి. అయితే ఇక్కడ అలాంటి అనుమతులు పొందకుండానే పనులు ప్రారంభించారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాలా పర్మిషన్ మాత్రమే తీసుకుని వెంచర్నిర్మాణ పనులకు రియల్టర్లు పూనుకోవడం అక్రమాలకు తావిస్తుంది. వెంచర్ అభివృద్ధి పేరిట ప్రాంతంలోని భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు సాగునీరు అందించే చిన్న కాలువలను మట్టితో పూడ్చివేస్తూ వాటి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. భూగర్భ జలాలకు ఆధారమైన పాత బావులను కూడా మట్టితో నింపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదంలో గ్రామ చరిత్ర, వారసత్వం..

గ్రామ చరిత్రకు చిహ్నంగా నిలిచిన పురాతన బురుజు చుట్టూ వెంచర్ నిర్మాణాలు చేపట్టడంతో దాని ఉనికే ప్రమాదంలో పడింది. బురుజు చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించడంతో అక్కడికి వెళ్లే మార్గాలు కూడా ఇరుకుగా మారాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు ఆరాధించే బాలమ్మ, మైసమ్మ దేవతల ఆలయాలు ప్రస్తుతం వెంచర్ పరిధిలోకి రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయాల గర్భగుడులను తొలగించే ప్రమాదం ఉందని, దేవతల ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నాలు జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

అధికారులు స్పందించాలంటూ డిమాండ్..

సర్వే నెంబర్ 80లో జరుగుతున్న భూసేకరణ, వెంచర్ విస్తీర్ణం పై రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పూర్తి సర్వే చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాలువల పూడ్చివేతపై ఇరిగేషన్ శాఖ, చెట్ల నరికివేతపై అటవీ శాఖ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.గ్రామ సంపద, ప్రజా వనరులు, పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని తమ్మడపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ శాఖల నిర్లక్ష్యంపై విమర్శలు గ్రామ సంపదను కాపాడాలి.. అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి" అంటూ తమ్మడపల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు. ఎంపీఈఓ

తమ్మడపల్లి సర్వేనెంబర్ 80లో అక్రమంగా జరుగుతున్న వెంచర్ పై వచ్చిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించి రియల్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు మర్రిగూడ ఎంపీ ఈవో రవికుమార్ తెలిపారు. హెచ్ఎండీఏ పర్మిషన్ వచ్చిన తర్వాతనే వెంచర్ పనులు చేయాలని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు.

Next Story