- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్నిప్రమాదంలో రెండు ఇండ్లు దగ్ధం.. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం
by Batti.Sumithra |
ఆసిఫాబాద్ మండలంలోని దస్నాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని దస్నాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బండే మానాజీ, బండే సావిత్రిబాయిలకు చెందిన ఇళ్లలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఇళ్లలో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిప్రమాదానికి గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు ఘటనాస్థలికి చేరుకునేలోపే రెండు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇళ్లలో ఉన్న విలువైన సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.
Next Story






