- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో వెయిటర్ జీతం ఎంతో తెలుసా? కోటీశ్వరులు అయిపోవచ్చు
అమెరికా ఇది చాలా మందికి కలల దేశం. ముఖ్యంగా భారతీయులకు అందులోనూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికా వెళ్లి ఉద్యోగం చేయడం అనేది ఓ డ్రీమ్ లా మారిపోయింది. ఇప్పటికే వేల సంఖ్యలో ఆ దేశానికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ఇది చాలా మందికి కలల దేశం. ముఖ్యంగా భారతీయులకు అందులోనూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికా వెళ్లి ఉద్యోగం చేయడం అనేది ఓ డ్రీమ్ లా మారిపోయింది. ఇప్పటికే వేల సంఖ్యలో ఆ దేశానికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు ఉన్నారు. వీసా రూల్స్ ఎంత కఠినమైనా.. ట్యాక్సులు పెంచినా అమెరికా అంటే పరుగులు పెట్టేస్తారు. అమెరికా వెళ్లేందుకు అంతగా ఇష్టపడటానికి కారణం అక్కడ వచ్చే జీతాలే. చాలా మంది అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేస్తేనే ఎక్కువ సంపాదన ఉంటుందని అనుకుంటారు. కానీ అక్కడ వెయిటర్ సంపాదన తెలిసినా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా అమెరికన్ రెస్టారెంట్లలో పనిచేసేవాళ్లకు గంటకు 6 నుండి 15 డాలర్ల వరకు జీతం ఇస్తారు. అలా వచ్చే జీతంతో నెలకు లక్ష నుండి రెండు లక్షల వరకు జీతం పొందవచ్చు. అమెరికాలో ఇచ్చే జీతం కంటే టిప్స్ ఏ ఎక్కువ.
కస్టమర్ రెస్టారెంట్ లో చేసిన బిల్ లో పది నుండి 20 శాతం టిప్ గానే ఇస్తారు. అంటే 10వేలు బిల్ చేస్తే అందులో వెయ్యి నుండి రెండువేల వరకు టిప్ ఇస్తారు. ఇలా టిప్ ల రూపంలో వెయిటర్ నెలకు దాదాపు 2 నుండి 3 లక్షల వరకు సంపాదిస్తారు. అంటే వెయిటర్ గా పనిచేస్తే నెలకు మొత్తం 5 లక్షల వరకు సంపాదించవచ్చు. సంపాదించిన మొత్తం జీతంలో ప్రతి నెల ట్యాక్స్ లు ఇతర ఖర్చులు పక్కన పెడితే దాదాపు లక్ష నుండి 2 లక్షల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. అమెరికాలో ఈ రేంజ్ లో సంపాదన ఉంటుంది కాబట్టే చాలా మందికి కలల దేశంగా మారింది. మరి చిన్న చిన్న ఉద్యోగాలకే ఈ స్థాయిలో సంపాదన ఉంటే ఎందుకు వెళ్లరు. అయితే జీతం ఎక్కువ వస్తుంది కదా అని ఎలా పడితే అలా వెళ్లిపోతానంటే కుదరదు. ఇంట్రెస్ట్ ఉంటే లీగల్ గా వీసా తీసుకుని వెళితే అనుకున్నట్టుగానే కలలు నెరవేరతాయి. లేదంటే కటకటాల్లోకి వెళ్లి తరవాత బాధపడాల్సి వస్తుంది.






