అంచన్‌పల్లి టోల్‌గేట్ వద్ద లారీ-బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

అంచన్‌పల్లి టోల్‌గేట్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అంచన్‌పల్లి టోల్‌గేట్ వద్ద లారీ-బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : అంచన్‌పల్లి టోల్‌గేట్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తివివరాల్లోకెళ్లితే గుమ్మడాల గ్రామానికి చెందిన వెంకటేష్ (30) పని నిమిత్తం బైక్‌ పై మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ ఎడమ కాలు విరగడంతో పాటు శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ కేశవులు, పైలట్ చాంద్ పాషా ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Next Story