మొదట్లో సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు అదంటేనే భయం వేస్తోంది..

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-22 15:41:25  IST  )

మొదట్లో సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేశాం. రోజుకి 3-4 సార్లు కలుసుకున్నాం. అప్పుడేమనిపించలేదు.

మొదట్లో సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు అదంటేనే భయం వేస్తోంది..
X

మేడమ్.. నా వయసు 25 సంవత్సరాలు. మా పెళ్లాయి రెండేళ్లు అవుతుంది. మొదట్లో సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేశాం. కానీ గత 5 నెలల నుండి అంగప్రవేశం తర్వాత యోనిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. మా వారి అంగం కూడా నొప్పిగా ఉందంటున్నారు. అంతకు ముందు నాకు సెక్స్‌లో ఆసక్తి ఉండేది. ఇప్పుడు సెక్స్ అంటేనే భయమేస్తోంది. సెక్స్ ముగించిన తర్వాత యోని దగ్గర చేయి పెడితే వేడిగా ఉంటుంది. ఒక గంట వరకు కనీసం కాళ్ళు కూడా కదవలేక పోతున్నా. ఒక్కోసారి రోజుకి 3-4 సార్లు కలుసుకున్నాం. అప్పుడేమనిపించలేదు. కానీ, ఇప్పుడు ఎందుకిలా అవుతోంది? ఈ మధ్యనే బరువు పెరిగాను. హెయిర్ లాస్, మొటిమలు ఉన్నాయి. నెలసరి కూడా సరిగా రావడం లేదు. గత మూడు నెలలుగా మా వారితో సెక్స్‌కు దూరంగా ఉంటున్నా. నా సమస్యకి మీరే పరిష్కార మార్గం చూపగలరు.

మీ సమస్యకు కారణాలు ఒకటి యోనిలో పూర్తిస్థాయిలో స్రావాలు విడుదల కాక ముందే కలవడం. దానివల్ల రాపిడి కలుగుతుంది. ఈ బలవంతపు కలయిక వల్ల యోని సున్నితమైన పొరల్లో అంగం పూర్వచర్మ భాగంలోని (గ్లాన్స్ పెవిస్) పొరలు చిట్లి ఉంటాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్ సోకి మంట, నొప్పి వస్తున్నాయి. ఇదే గర్భాశయానికి, మూత్రాశయానికి వ్యాపించి, అంతర్గతంగా ఇన్ఫెక్షన్స్ పాకి ఉంటాయి. మూత్రంలో మంట, నొప్పి, పొత్తి కడుపులో కలయికప్పుడు, తర్వాత నొప్పి కలుగుతుంటాయి. అలాగే, లైంగిక అవయవాలను సబ్బు, డెటాల్, వెజైనల్ డౌచ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. శుభ్రమైన నీటితో మాత్రమే జననాంగాలు కడుక్కోవాలి, స్త్రీ పురుషులిద్దరు. అలాగే, పురుషాంగం పూర్వచర్మం కింద పాచి పేర్కొంటుంది. దాన్ని శుభ్రమైన నీటితోనే కడగాలి, సబ్బుతో కాదు. మీ దంపతులిద్దరూ ఒకసారి డాక్టర్ని కలిసి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. దాంతో పాటుగా నువ్వు లావు తగ్గాలి. వాకింగ్, ఎక్సర్సైజులు చేయాలి. కొవ్వు, పిండి పదార్థాలు, స్వీట్లు, దుంపలు తినడం తగ్గించాలి.

Read Also.. నీ భర్త నిన్ను అనుమానించడానికి కారణం అదే..!

Read Also.. ‘నా భర్త రోజూ సుఖపెడుతున్నా.. బాయ్ ఫ్రెండ్స్‌తో శృంగారం చేయకుండా ఉండలేకపోతున్న..’

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story