- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ భర్త నిన్ను అనుమానించడానికి కారణం అదే..!
ఆయన రెండేళ్లుగా నాతో సరిగా ఉండటం లేదు. అనుమానిస్తున్నారు. నాతో మాట్లాడరు. ఉద్యోగం సరిగా చేయరు.

మేడమ్! నాకు వివాహమై 19 సంవత్సరాలవుతోంది. నా వయస్సు 35. మా వారికి నేనంటే చాలా ప్రేమ. ఆయనకు శ్రీఘ్రస్ఖలన సమస్య మొదట్నించీ ఉంది. మొదట్లో ఫర్వాలేదనిపించినా మెల్లగా అది ఎక్కువైంది. క్షణాల్లో స్ఖలనం అవుతోంది. సమస్య సెక్స్ కాదు. నాకు ఆయనే ముఖ్యం. ఆయన రెండేళ్లుగా నాతో సరిగా ఉండటం లేదు. అనుమానిస్తున్నారు. నాతో మాట్లాడరు. ఉద్యోగం సరిగా చేయరు. డాక్టర్‌ను కలుద్దామంటే రారు. డాక్టరు వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోవడం నా ఆనందం కోసం కాదు. ఆయన బాధ తగ్గడం కోసం. కానీ, ఎంత చెప్పినా హాస్పిటల్‌కు రారు. ఏం చేయమంటారో చెప్పండి.
నిజంగా ఈ సమస్య వల్ల ఇద్దరూ బాధపడుతున్నారు. భర్తకి సెక్స్ సమస్య ఉంటే భార్య అర్థం చేస్కోదని భర్తలు ఎందుకు అనుకుంటారు? ఇద్దరికీ సమస్య కదా. శీఘ్రస్థలన సమస్య జలుబు లాంటిది. ప్రపంచంలో కోటానుకోట్ల మంది పురుషులకి ఇది ఉంది. ఇది తగ్గని సమస్య ఏ మాత్రమూ కాదు. శీఘ్రంగా అంటే త్వరగా అయ్యే స్థలనాన్ని ఆపి, అవగస్తంభన కాలాన్ని పెంచే సెక్స్ థెరపీలో కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ సాధన చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కొన్ని భర్త విడిగా, కొన్ని భార్య సహకారంతో చేయాలి. ఫర్ఫార్మెన్స్ ఆంగ్జెటీ వల్ల శీఘ్రస్థలనం వస్తుంది. శీఘ్రస్థలనం తగ్గక పోతే ఫర్ ఫార్మెన్స్ ఆంగ్జెటీ ఇంకా ఎక్కువవుతుంది. దీనికి సైకోథెరపీ ఉంది. శీఘ్రస్థలన సమస్యకు మానసిక కారణాలలో విపరీతమైన ఆందోళన, భయం, అజ్ఞానం, భాగస్వామి తిరస్కారం వంటివి ఉన్నాయి. ఇక శారీరక కారణాల్లో సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం, తరచూ వచ్చే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ ఫెక్షన్స్, డయాబెటిన్, బీపీ వంటివి. ఏదేమైనా మిమ్మల్ని ఆనందపరచలేకపోతున్నానన్న బాధలోంచి వచ్చిన కోపం, చిరాకు, ఆత్మన్యూనత, మిమ్మల్ని అనుమానించే స్థాయికి తీసుకెళ్లాయి. సెక్స్ కంటే తన ప్రేమే ముఖ్యమని భరోసా ఇవ్వండి. శీఘ్రస్ఖలనం అవమానకరమైన, సిగ్గుతో భయపడే అంశం కాదు. మీ వారిని సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్ళండి. ఇద్దరికీ కౌన్సెలింగ్, సెక్స్ సైకోథెరపీ చాలా అవసరం. రెండు రోజుల చికిత్సతో తగ్గిపోయే దానికి జీవితాన్ని నరకంలా మార్చుకోకండి.
Read Also.. మొదట్లో సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు అదంటేనే భయం వేస్తోంది..
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్






