Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?

by Javid Pasha |   (  Updated:2025-06-13 10:28:54  IST  )

Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?

Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?
X

* పాఠకుల సందేహాలకు సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ భారతి సమాధానాలు

మేడం.. నా వయసు యాభై. మోనోపాజ్ దశ స్త్రీలలో శృంగార జీవితానికి ముగింపా ? ఈ కాలంలో స్త్రీలు లావుగా మారిపోతారా ? సెక్స్ పై వాళ్లు ఆసక్తిని కోల్పోతారా ? పురుషులకి మోనోపాజ్ లేదా ?

జవాబు : ఇది తప్పుడు అభిప్రాయం. మోనోపాజ్ దశ పురుషులకూ ఉంటుంది. ఈ సమయంలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ హార్మోన్ల లోపం లేదా అసమతుల్యత సమానంగానే ఉంటుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల యోని నాళం పొడిగా, కలయిక బాధాకరంగా ఉంటుంది.. కాబట్టి సెక్స్ పై విముఖత ఏర్పడుతుంది. దీనికోసం యోనిలోకి ఈస్ట్రోజన్ క్రీం వాడుతూ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో హెచ్ఆర్ టి చికిత్స తీసుకోవాలి. ఆహారంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉండే సోయాబిన్ ఉండేలా చూసుకోవాలి. దీని లోపం వల్ల కొవ్వు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు వాకింగ్, యోగా చేస్తూ కొవ్వు, చక్కర పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఫలితంగా ఎప్పటిలాగే శృంగారంపై వారిలో ఆసక్తి ఉంటుంది.

మేడం.. జననాంగాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల సబ్బు నీరు, డెటాల్ తో శుభ్రం చేసుకోవచ్చా ?

జవాబు : నిజానికి అంతర, బాహ్య జనన అవయవాలను శుభ్రం చేసుకునే విధానంలో భాగంగానే పిహెచ్ స్రావాలు (ఆల్కలైన్) ఎప్పుడూ జననాంగాల్లో స్రవిస్తూ ఉంటాయి. అక్కడ చేరే హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ లను ఇవి ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ జననాంగ ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడూ పరిశుభ్రమైన నీటితో మాత్రమే అవయవాలను కడుగుతూ ఉండాలి. సబ్బు, డెటాల్ లాంటివి వాడకూడదు. వీటివల్ల అక్కడే ఆల్కలైన్ స్రావాలను సమతుల్యం చేసే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. పైగా సబ్బు, డెటాల్ లాంటి కెమికల్స్ వాడకంతో అక్కడ సున్నితమైన పొరలు దెబ్బతిని వాపు, ఎరుపు నొప్పితో వెజినైటస్ కి దారి తీయవచ్చు. దీంతో మందులతో తగ్గని వైట్ డిస్చార్జ్ మూత్రంలో మంట కలయికలో నొప్పి వంటివి కలుగుతాయి. ఫలితంగా దాంపత్య జీవితం అంటేనే వారికి విరక్తి కలుగుతుంది. మగవారు కూడా మంచినీటితో మాత్రమే జననాంగాన్ని శుభ్రం చేసుకోవాలి

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Read more : ఆహారానికి, శృంగారానికి మధ్య సంబంధం.. ఆ సమయంలో మొదలెడితే రొమాన్స్ పీక్స్

పెళ్లై రెండేండ్లయినా మా ఆయన ఏం చేయట్లేదు..! ఆ టచ్ చాలా మిస్సవుతున్నా..!!

Next Story