పెళ్లై రెండేండ్లయినా మా ఆయన ఏం చేయట్లేదు..! ఆ టచ్ చాలా మిస్సవుతున్నా..!!

by Javid Pasha |   (  Updated:2025-06-13 10:31:44  IST  )

పెళ్లై రెండేండ్లయినా మా ఆయన ఏం చేయట్లేదు..! ఆ టచ్ చాలా మిస్సవుతున్నా..!!

పెళ్లై రెండేండ్లయినా మా ఆయన ఏం చేయట్లేదు..! ఆ టచ్ చాలా మిస్సవుతున్నా..!!
X

ప్రశ్న : మేడం.. నా వివాహమై రెండు సంవత్సరాలు అయింది. నేనొక ప్రైవేట్ కాలేజీలో తెలుగు లెక్చరర్‌ను. నేను ఎదుటి మనిషిలో ప్రేమను వెతుక్కునే మనిషిని. నా భర్త అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఆయన తనకు శృంగారం కావాలనుకున్నప్పుడు మాత్రమే నన్ను స్పర్శిస్తాడు. నాకేమో అతడు నన్ను ప్రేమతో కౌగిలించుకోవాలని, నా చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకోవాలని.. ఏదో ఒక కారణంతో నా భర్తకి దగ్గర అవ్వాలని తపించిపోతాను. నాకు కావాల్సింది శృంగారం మాత్రమే కాదని అతనికి ఎలా తెలపాలి ? - స్వప్న, హైదరాబాద్

జవాబు : స్వప్నా.. మీరు అన్నదాంట్లో న్యాయం ఉంది. ప్రతి భర్త తన భార్య తనతో చెప్పదలుచుకున్నది ఏమిటో, ఆమెకి కావలసింది ఏమిటో తప్పనిసరిగా వినాలి. జీవితంలో ఒక్కసారి అయినా సరే.. భార్యకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడంతో పాటుగా, అవకాశం వచ్చినప్పుడల్లా తను కూడా భార్యపై ప్రేమని వ్యక్తపరుస్తూ ఉండాలి. దంపతుల మధ్య సంబంధం తాజాగా ఉండడానికి ఇది చాలా కీలకం.కేవలం శృంగార వాంఛ కలిగినప్పుడే కాకుండా ఇతర సమయాల్లోనూ తన భావోద్వేగాలను, ప్రేమాప్యాయతలను చిన్న చిన్న స్పర్శల ద్వారా భార్యకి తెలియజేయాలి. చాలామంది భర్తలకు భార్యల మీద ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తం చేయరు. కారణం పురుషాహంకారంతోపాటుగా ఇవన్నీ వారికి చిన్న విషయాలుగా కనిపించడమే. భార్య పట్ల విలువ, గౌరవం లేకపోవడమే. ఆమెకు అంత ప్రాముఖ్యత ఎందుకని భావించడమే. పురుషులకు ఇంత ఈగో ఉండకూడదు. భార్య ఇతర పనుల్లో ఉన్నప్పుడు తాను కూడా ఇంటి పనుల్లో ఆమెకు సహాయం చేస్తూనే చిన్న స్పర్శల ద్వారా ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పొచ్చు. జ్వరం వచ్చినప్పుడు సేవ చేస్తూ ఉండడం కూడా ఒక ప్రేమ వ్యక్తీకరణనే.

దంపతుల మధ్య ఇష్టమైన స్పర్శ ఎన్నో ప్రేమ సందేశాలను తెస్తుంది. శృంగార వాంఛతో సంబంధంలేని నిబంధనలు లేని ప్రేమ ఎందరు భర్తలు భార్యలకు ఇవ్వగలుగుతున్నారు ? అలాగని శృంగారాన్ని తక్కువ చేయడం కాదు. శృంగారం దంపతుల మధ్య ప్రేమకు ఒక అందమైన వ్యక్తీకరణ. శరీరం ఒక మాధ్యమం మాత్రమే. శృంగారం ఒక అద్భుతమైన దేహ భాష. దంపతుల మధ్య ప్రేమనీ, ఆప్యాయతను పరస్పర రక్షణను నమ్మకాలతో కూడిన వాగ్దానాన్ని చేసే ప్రణయ కావ్యం శృంగారం. శృంగారం.. స్త్రీ పురుష జననాంగాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. దేహాల ద్వారా హృదయానికి చేరే భావోద్వేగాల వినిమయం. శృంగారంలో మనసు, శరీరాల సమన్వయం ముఖ్యం. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. భార్యతో శృంగారవసరం కోసం మాత్రమే నేరపేది అన్నిటిలాగే ఒక అవసర సంబంధంగా మిగిలిపోతుంది. ఆధిపత్యంతోను, అహంకారంతోనూ.. ఎదుటి మనిషిని దోచుకోవడం అసాధ్యం. ముందు మీ భర్తకి మీ ప్రేమను స్పర్శ ద్వారా వ్యక్తీకరించండి. ప్రేమించడం ఎలానో నేర్పండి. తన నుంచి మీకు ఏం కావాలో స్పష్టంగా చెప్పండి. మీరు ఆయనతో కేవలం సెక్స్ విషయంలో మాత్రమే కాకుండా మీ ఇద్దరి మధ్య ఉండే ప్రతి విషయంలో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నట్టు తెలియజేయండి . అర్థం కాకపోతే ఆయనను మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకొని వెళ్లండి.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225


Also Read..

Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?


Next Story