- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆహారానికి, శృంగారానికి మధ్య సంబంధం.. ఆ సమయంలో మొదలెడితే రొమాన్స్ పీక్స్
ఆహారానికి, శృంగారానికి మధ్య సంబంధం ఉంటుందా? అసలు ఫుడ్‌కు రొమాన్స్‌కు మధ్య రిలేషన్ ఏంటి? అనే విషయంపై పరిశోధించిన సైంటిస్టులు.. కడుపు నిండా తింటే రొమాంటిక్ నేచర్ మరింత పెరుగుతుందని గుర్తించారు.

దిశ, ఫీచర్స్ : ఆహారానికి, శృంగారానికి మధ్య సంబంధం ఉంటుందా? అసలు ఫుడ్‌కు రొమాన్స్‌కు మధ్య రిలేషన్ ఏంటి? అనే విషయంపై పరిశోధించిన సైంటిస్టులు.. కడుపు నిండా తింటే రొమాంటిక్ నేచర్ మరింత పెరుగుతుందని గుర్తించారు. ఎపెటైట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం స్త్రీలు ఆకలితో ఉన్నప్పటికంటే ఫుల్లుగా లాగించాక భాగస్వాములతో రొమాన్స్ ఎంజాయ్ చేస్తారని సూచించింది. ఆకలితో ఉన్నప్పుడు మహిళల దృష్టి ఆహారంపై ఉంటుందని.. కానీ ఆహారం తీసుకున్నాక రొమాంటిక్ ఉద్దీపనల వంటి ఇతర రివార్డ్‌లవైపు దృష్టి మళ్లుతుందని చెప్తుంది. ఆహారం, సెక్స్‌కు సంబంధించిన న్యూరల్ సర్క్యూట్‌ల మధ్య సంబంధం గురించి హైలెట్ చేస్తుంది.
డ్రెక్సెల్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో.. 20 మంది సాధారణ బరువు గల అమ్మాయిలను ఎంపిక చేశారు. సగం మంది గతంలో రెండుసార్లు డైటింగ్ చేసినవారు. మిగిలిన సగం ఎప్పుడూ డైటింగ్ చేయనివారు. ఎనిమిది గంటలు ఉపవాసం ఉన్న తర్వాత వీరికి fMRI స్కానర్‌లో రొమాంటిక్ చిత్రాలు, న్యూట్రల్ చిత్రాలు చూపించారు. తర్వాత 500 క్యాలరీల మీల్ రీప్లేస్‌మెంట్ షేక్ తాగిన తర్వాత అదే ప్రక్రియ రిపీట్ చేశారు. ఆహారం తీసుకున్న తర్వాత రివార్డ్‌తో సంబంధిత మెదడు ప్రాంతాలలో రొమాంటిక్ చిత్రాలకు ఎక్కువ స్పందన ఉంది. గతంలో డైటింగ్ చేసిన మహిళలలో ఈ స్పందన మరింత బలంగా ఉంది. ఇది ఆకలితో ఉన్నప్పుడు ఆహారం, డబ్బు వంటి రివార్డ్‌లకు ఎక్కువ స్పందన ఉంటుందనే మునుపటి అధ్యయనాలకు సవాల్ చేస్తుంది. అంతేకాదు తీపి రుచులు రొమాంటిక్ ఆకర్షణను మరింత పెంచవచ్చని పర్డ్యూ యూనివర్శిటీ అధ్యయనం సూచించింది.






