బిగ్ బ్రేకింగ్ : అబార్షన్‌పై స్పందించిన సమంత

by  |
బిగ్ బ్రేకింగ్ : అబార్షన్‌పై స్పందించిన సమంత
X

దిశ, సినిమా : సమంత-నాగచైతన్య డివోర్స్ దాదాపు నెలరోజులుగా ట్రెండింగ్‌లోనే ఉంటుంది. రూమర్స్ వస్తున్నాయని ప్రచారం చేయడం ఓకే కానీ విడాకులు కన్‌ఫర్మ్ చేశాక కూడా ఎందుకు విడిపోయారు? ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నలతో కథలు కథలుగా ప్రచారాలు చేస్తోంది మీడియా, సోషల్ మీడియా. ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్‌తో విసిగిపోయిన సామ్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ స్టేట్‌మెంట్ పోస్ట్ చేసింది.

తనపై వస్తున్న అబద్ధపు ఆరోపణలను వ్యతిరేకించి, కన్సర్న్ చూపించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పిన సామ్.. తనకు ఈ సమయంలో సపోర్ట్ చాలా అవసరమని కోరింది. డివోర్స్ అనేది పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అని.. ఈ బాధ నుంచి బయటపడేందుకు సమయం పడుతుందని వివరించింది. కానీ ఇలాంటి టైంలో తనకు ఇల్లీగల్ అఫెయిర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, అవకాశవాదినని ప్రచారం చేయడం తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పర్సనల్‌గా ఇలాంటి అటాక్ చేయడం అనేది కనికరం లేనిదిగా భావిస్తున్నానన్న సామ్.. ఇవేవీ తనను బ్రేక్ చేయలేవని అభిమానులకు ప్రామిస్ చేసింది.

సాయితేజ్‌కు రెండు సర్జరీలు.. డిశ్చార్జ్ అయ్యేది అప్పుడే!

Next Story

Most Viewed