విడాకుల తర్వాత చై నిర్ణయం ఏంటి.. వాటిని సామ్‌కి ఇచ్చేస్తాడా.. ?

by  |
విడాకుల తర్వాత చై నిర్ణయం ఏంటి.. వాటిని సామ్‌కి ఇచ్చేస్తాడా.. ?
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని వారి వారి పనుల్లో బిజీ అయిపోతున్నారు. ఇక విడాకుల బాధను మర్చిపోవడానికి సామ్ తమ స్నేహితులతో సరదగా గడుపుతూ, ఎంజాయ్ చేస్తోంది. చైతన్య కూడా తన కెరీయర్‌పై దృష్టి పెట్టి, వరస సినిమాలతో బిజీ అయిపోయాడు. విడాకుల సమయంలో వీరిపై నెటిజన్లు చాలా ట్రోల్స్ చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా ఇద్దరూ తమ కెరీయర్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎవరి జీవితాలు వారివి, ఎవరి స్వేచ్ఛ వారిది అన్నట్టు ఇతర భాషల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్, గెస్ట్ హౌస్ విషయంలో ఇంకా లెక్క తేలనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సామ్‌కు తన చిన్నప్పటి నుంచి మూగజీవాలు, మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికి వాటితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ పెట్ డాగ్ ఎవరు తీసుకుంటారు అనేదానిపై సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇద్దరి ఎమోషన్స్ ఎంతో కీలకమైనవి, ఎందుకంటే మూగ జీవాలతో అనుబంధాన్ని తుంచేయడం అంత సులభం కాదు. ఈ విషయంలో ఎవరి హక్కులకు భంగం కలగకుండా న్యాయం జరగాలి. కానీ ఇది అంత సులభం కాదు. చైకి కూడా ఆ డాగ్స్ అంటే ఎంతో ఇష్టం, ఇక సామ్ గురించి చెప్పనవసరం లేదు, ఇక ఈ విషయంలో ఎవరో ఒకరి ఎమోషన్‌ని వదులకుని వెనక్కి తగ్గితే తప్ప వ్యవహారం అంత తొందరగా తేలదు. దీంతో ఈ పెట్ డాగ్ చై తీసుకుంటారా.. లేక సామ్‌కు మూగజీవాలు అంటే ఇష్టం కాబట్టి సామ్‌కు ఇచ్చేస్తారా అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. అంతే కాకుండా గెస్ట్ హౌజ్ కూడా సామ్ ఎంతో ఇష్టపడి వ్యక్తిగతంగా నిర్మించుకున్నది కాబట్టి ఆ జ్ఞాపకాలు ఎప్పటికి ఉంటాయి. నాగచైతన్యకు కూడా ఆ గెస్ట్ హౌస్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆ ఇంటి జ్ఞాపకాల్ని రానివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెంటిమెంట్ ప్రకారం.. గెస్ట్ హౌస్ ని ఖరీదు కట్టి సెటిల్ చేసుకుంటారా? లేకపోతే ఈ వ్యవహారం ఎలా సాగుతుందో అని అభిమానులు పలువిధాలుగా గుసగుసలాడుతున్నారు.

చైతుకు సరైన జోడీ దొరికేసింది.. అభిమానులు ఫిదా



Next Story