చైతుకు సరైన జోడీ దొరికేసింది.. అభిమానులు ఫిదా

by  |
చైతుకు సరైన జోడీ దొరికేసింది.. అభిమానులు ఫిదా
X

దిశ, సినిమా: కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్యల మల్టీస్టారర్ ఫిల్మ్ ‘బంగార్రాజు’. కాగా ఈ సినిమాలో చైతూకు జోడిగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తుండగా.. తనకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు మేకర్స్. నాగలక్ష్మి పాత్రలో కనిపించబోతున్న కృతి.. గ్రీన్ కలర్ చీరకట్టు లంగా ఓణిలో మెరిసిపోతుంది. మెడలో దండలు, చేతిలో కళ్లద్దాలతో ఓ రాజకీయ నాయకురాలి లెవల్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్నట్లు కనిపిస్తుండగా.. ఈ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

చైతుకు సరైన జోడీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ వస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

విడాకుల తర్వాత చై నిర్ణయం ఏంటి.. వాటిని సామ్‌కి ఇచ్చేస్తాడా.. ?

అనుష్క శెట్టితో చైతు ఎగేజ్‌మెంట్.. నాగ్ ఏమన్నాడంటే?

slug : First Look of Krithi Shetty as Naga Lakshmi from Bangarraju
Photo :


Next Story

Most Viewed