RRR సెట్‌లో చరణ్, తారక్ సీక్రెట్ లీక్ చేసిన జక్కన్న.. హీరోల రియాక్షన్ (వీడియో)

by  |
RRR సెట్‌లో చరణ్, తారక్ సీక్రెట్ లీక్ చేసిన జక్కన్న.. హీరోల రియాక్షన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా (శనివారం) ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్‌లో చరణ్, తారక్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. చరణ్, తారక్ చాలా అల్లరి చేస్తారంటూ చెప్పుకొచ్చారు. అయితే జక్కన్న ఓ విషయం చెబుతున్న సమయంలో అటూ చరణ్ అడ్డుపడుతుండగా, తారక్ మాత్రం ఏకంగా రాజమౌళిని గిల్లేశాడు. దాంతో రాజమౌళి అక్కడి నుంచి లేచి విషయాన్ని చెబుతారు.

చరణ్, తారక్‌తో చాలా ఇబ్బంది పడ్డాను, సినిమా షూటింగ్ 300ల రోజులైతే, వీరిద్దరి మూలంగా 28 రోజులు వేస్ట్ అయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరికి దాదాపు30 ఏళ్లపైనే ఉంటాయి. మ్యారేజ్ కూడా అయ్యింది, మీరు లేకుంటే చచ్చిపోతాను అనే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సెట్‌లోకి వచ్చే సరికి జక్కన్న చరణ్ గిల్లుతున్నాడు అంటూ తారక్ కంప్లేయింట్ చేస్తారు. ఇక చరణ్‌ను చూసే సరికి అమాయకుడిలా లేదు జక్కన్న నేను గిల్లలేదు అంటారు. ఓ పది పదిహేను నిమిషాలు ఈ టాపిక్ పై జరుగుతూనే ఉండేదంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

హాట్ రోబోలా కనిపిస్తున్న మిల్కీ బ్యూటీ.. ఆంటీ ఈజ్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్స్

https://twitter.com/DevDTweetz/status/1469537678379130883?s=20

Next Story

Most Viewed