రాహుల్ ద్రవిడ్ నా ఫస్ట్ లవ్.. నటి హాట్ కామెంట్స్ వైరల్

by  |
dravid
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటి రిచా చద్దా.. మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన మొదటి క్రష్ అని వెల్లడించింది. తాను ఎప్పుడు క్రికెట్‌ను చూసే దాన్ని కాదని.. అయితే ద్రవిడ్‌ను చూడటం కోసం మాత్రమే తన సోదరుడితో కలిసి క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ ఉంటానని చెప్పింది.

“నా చిన్నతనంలో నేను క్రికెట్‌కు పెద్ద అభిమానిని కాదు. కానీ, మా అన్న క్రికెట్ ఆడేవాడు. నేను టీవీలో క్రికెట్‌ను అప్పుడప్పుడు చూసిన సందర్భాలు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్ ఆట చూడటం అంటే నాకు చాలా ఇష్టం. నా మొదటి మొహబ్బత్ రాహుల్ ద్రవిడ్” అని చద్దా టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పింది. అయితే UAEలో T20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత రవి శాస్త్రి పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇటీవల స్వదేశంలో జరిగిన T20I సిరీస్‌లో 3-0తో న్యూజిలాండ్‌ను ఓడించినందున అతను శాశ్వత ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.

అయితే ద్రవిడ్ ఆటలోకి మళ్లీ రానప్పటికీ, భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చద్దా పేర్కొన్నారు. దీంతో ఆమె క్రికెట్ ను మళ్లీ చూడడం స్టార్ట్ చేస్తానని చెప్పింది. డిసెంబర్, జనవరిలో ఆల్-ఫార్మాట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లే భారత జట్టుతో ద్రవిడ్ ఇప్పుడు ఉంటాడు. అయితే.. ద్రవిడ్ 2012లో తన టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించగా.. 2011లో తన చివరి పరిమిత ఓవర్ల గేమ్‌లో లాస్ట్ మ్యాచ్ ఆడాడు.

ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్న శ్యామ్ సింగ రాయ్ లిప్‌లాక్



Next Story

Most Viewed