ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్న శ్యామ్ సింగ రాయ్ లిప్‌లాక్

by  |
nani
X

దిశ,వెబ్ డెస్క్: శ్యామ్ సింగ రాయ్ టీజర్‌లో నాని కృతి శెట్టికి మధ్య ఉన్న ప్రేమను చెప్పడానికి లిప్ లాక్ సీన్ తో అదరగొట్టేశారు. ఈ లిప్ లాక్ సీన్ టీజర్ లో హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మంచి మెలోడి, రొమాంటిక్ సాంగ్.. ఏదో ఏదో లిరికల్ సెకండ్ సింగిల్ నవంబర్ 25న విడుదల అవుతోంది. దీంతో నాని, కృతి మధ్య మరిన్ని రొమాంటిక్ ట్రాక్‌లను చూసే అవకాశం అభిమానలకు దక్కనుంది.

ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాని కృతి శెట్టిని ముద్దు పెట్టుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూవీలో నాని సెకండ్ షేడ్ వాసు చాలా కూల్‌గా, క్లాస్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు కృతి చాలా అందంగా కనిపిస్తోంది. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండిందని అర్థమౌతోంది. ఈ సినిమాకు సంగీతాన్నందించిన మిక్కీ J మేయర్ ఇప్పటికే మొదటి సింగిల్ రైజ్ ఆఫ్ శ్యామ్‌తో అలాగే టీజర్ కోసం అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.

విడాకులకు రెడీ అవుతున్న ప్రియాంక చోప్రా.. అందుకే అలా చేసిందా..?

https://twitter.com/NameisNani/status/1462745532703526918?t=ZxTW8PPRGY9J7RVW0K3y5Q&s=08

Next Story

Most Viewed