- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకురాలుగా పరిచయం కాబోతున్న హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ లైన్‌తో సినిమా!
టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకురాలుగా హీరోయిన్ షాలిని కొండేపూడి పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో కొత్త మహిళా దర్శకురాలు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ప్రశంసలు అందకున్న యంగ్ నటి షాలిని కొండేపూడి.. ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. తొలి చిత్రం ‘సింగ్ గీతం’లో తన సహజమైన నటన, రూపంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు తన గుర్తింపును మరింతగా పెంచుకుంటూ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. షాలిని కొండేపూడి దర్శకత్వం చేయనున్న తొలి చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందట. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా సాగే కథతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






