ట్రంప్‌కు వర్మ కౌంటర్

by  |
ట్రంప్‌కు వర్మ కౌంటర్
X

రామ్ గోపాల్ వర్మ… సినిమా డైరెక్టర్ కానీ వివాదాలు ఎక్కువ. ఏ విషయం గురించి మాట్లాడినా అందులో ఏదో ఒక వివాదం దాగుంటుంది. చాలా డిఫరెంట్‌గా ఆలోచించి .. దాన్ని ట్వీట్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… విమర్శలకు తెరతీయడం ఆయనకే చెల్లుతుంది. సినిమా నుంచి పాలిటిక్స్ వరకు … నిర్భయ నుంచి దిశ కేసు వరకు ఏ మ్యాటర్ అయినా సరే … అరే… ఆర్జీవి ఆలోచన ఇలా ఉందా? అనిపిస్తుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కేఏ పాల్ లాంటి వాళ్లు ఆయన ఆలోచనలకు బలైన వాళ్లే. ఆ వివాదాల్లో చిక్కుకుని పరువు పోగొట్టుకున్న వారే.

అయితే ఎప్పుడూ దేశ నాయకులనో, సినిమా సెలబ్రిటీస్‌నో కార్నర్ చేసే వర్మ… ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేశాడు. భారత పర్యటనకు విచ్చేస్తున్న డోనాల్డ్ ట్రంప్… ఇండియాలో తనకు 10 మిలియన్ల మంది ఆహ్వానం పలుకుతారన్న వ్యాఖ్యలపై వర్మ కౌంటర్ ఇచ్చాడు. ట్రంప్ కల నెరవేరాలంటే అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, రజినీ కాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, సన్నీ లియోన్ లాంటి వాళ్లను మేనేజ్ చేయాల్సి వస్తుందని ట్వీట్ చేశాడు. వాళ్లందరూ ట్రంప్ పక్కన నిలబడితే తప్పా… 10 మిలియన్ల మంది ట్రంప్‌కు ఆహ్వానం పలికే అవకాశం లేదని… దీన్ని ఫాలో అయిపోతే బెటర్ అని సూచించాడు.

ఏసీబీకి చిక్కిన సోషల్ వేల్ఫేర్ అధికారి

Next Story

Most Viewed