wiper helmet: కురుస్తున్న వర్షాలకి ఈ హెల్మెట్టే కరెక్ట్.. వినూత్న హెల్మెట్ వీడియో వైరల్..

by Indraja |
wiper helmet: కురుస్తున్న వర్షాలకి ఈ హెల్మెట్టే కరెక్ట్.. వినూత్న హెల్మెట్ వీడియో వైరల్..
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ హెల్మెట్ హల్చల్ చేస్తోంది. కాగా కురుస్తున్న వర్షాలకు ఈ హెల్మెట్ అయితేనే బెటర్ అని వీడియో చూసిన నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా వర్షంలో హెల్మెట్ పెట్టుకుని బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ గ్లాస్ పైన వర్షపు నీళ్లు పడడంతో సరిగా కనిపించదు. దీనితో ప్రమాధాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కుగా ఉంటుంది. అయితే వర్షంలో ఈ వైపర్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. వర్షపు నీరు హెల్మెట్‌పై పడినప్పుడు హెల్మెట్ పైన ఉండే వైపర్ ఆ నీటిని తుడిచేస్తుంది. ప్రస్తుతం ఈ హెల్మెట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

For Video Click here



Next Story

Most Viewed