ఆ ఆలయాల్లోకి పురుషులకు ‘నో ఎంట్రీ’ ఎందుకంటే?

by Samataha |
ఆ ఆలయాల్లోకి పురుషులకు ‘నో ఎంట్రీ’ ఎందుకంటే?
X

దిశ, ఫీచర్స్ : గుడి అంటే కుటుంబ సమేతంగా వెళ్లి ఆలయాలను సందర్శించుకుంటారు. అయి కొన్ని ఆలయాల్లోకి పురుషులకు ఎంట్రీ ఉండదు అని తెలుసా? ఏంటీ పురుషులు వెళ్లని ఆలయాలు కూడా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా? . అయితే మగవారు వెళ్లకూడని దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలోని ఫేమస్ టెంపుల్‌లో శ్రీ భగవతి ఆలయం ఒకటి. ఇది అప్పుజకు ఆగ్నేయంగా 30 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువైఉంటుంది. ఆ అమ్మవారిని మహిళలందరూ భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. ఇది చూడటానికి కూడా చాలా సుందరంగా ఉంటుంది. అక్కడి వాతావరణం పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ప్రసిద్ధ నదులైన పంపా, మణిపాల ఆలయానికి ఇరువైపులా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వెల్లడం కుదరదు. ఆ గుడిలోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మహిళలు వారం రోజులు ఉపవాసం ఉండి ఈ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు.

చాలా మందికి బ్రహ్మకు ఆలయం ఉందని కూడా తెలియదు. కానీ ఆ బ్రహ్మ దేవుడికి కూడా ఓ ఆలయం ఉంది. కానీ ఇందులోకి కూడా మగవారికి ఎంట్రీ లేదు. ఎందుకంటే సరస్వతీ దేవి శాపం వల్ల ఆ ఆలయంలోకి మగవారు వెళ్లరు. అసలు విషయంలోకి వెళ్లితే.. ఒకరోజు బ్రహ్మ యాగం చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో సరస్వతీ దేవి పక్కన లేకపోవడంతో బ్రహ్మ గాయత్రి అనే అమ్మాయిని వివాహం చేసుకొని యాగాన్ని పూర్తి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతి కోపంతో ఆ ఆలయంలోకి మగవారికి ప్రవేశంలేదు, ఒక వేళ వెళితే సంతాన సమస్యలు వస్తాయని శపిస్తుంది. అందువల్ల ఆ ఆలయంలోకి మగవారు వెళ్లరు. ఇక ఈ బ్రహ్మ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది.

Next Story