ప్యాంట్ జారిపోతుందని బెల్ట్ పెడుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే!

by Jakkula Samataha |
ప్యాంట్ జారిపోతుందని బెల్ట్ పెడుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే!
X

దిశ, ఫీచర్స్ : బెల్ట్ పెట్టుకోవడం అనేది చాలా కామన్. అమ్మాయిలు, అబ్బాయిలు జీన్స్ ధరించే క్రమంలో ప్యాంటె టైట్‌గా ఉండేందుకు బెల్ట్ పెట్టుకుంటారు. మరీ ముఖ్యంగా సన్నగా ఉన్నవారు, జారిపోతుందేమో అని భయంతో ప్రతి రోజూ బెల్డ్ యూస్ చేస్తుంటారు. మరి బిగుతుగా బెల్ట్ పెట్టుకుంటారు. అయితే ఇలా బెల్ట్ పెట్టుకోవడంపై నిపుణులు షాకింగ్ విషయాలు వెల్లడించారు .

టైట్‌గా బెల్ట్ పెట్టుకోవడం వలన నరాల సమస్య పెరుగుతోంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తెలియకుండా చేసే ఈ పొరపాటు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. టైట్‌గా బెల్ట్ పెట్టుకోవడం వలన పొత్తికడుపులో నొప్పి, నడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటాయంట. అంతే కాకుండా ఇది రక్తసరఫరాలో సమస్యలు తీసుకొచ్చి.. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం కావచ్చు అంటున్నారు. అదే విధంగా ఇప్పడున్న కాలంలో అమ్మాయిలు కూడా బెల్ట్ ఎక్కువగా ధరిస్తూ ఉన్నారు. అయితే ఇది వారి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. బిగుతుగా బెల్ట్ ధరించడం వలన గర్భం దాల్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా టైట్‌గా బెల్ట్ ధరించడం వలన వెన్నుముక పై కూడా దీని ప్రభావం పడనున్నదంట. అందువలన అస్సలే టైట్‌గా బెల్ట్ ధరించకూడదు అంటున్నారు నిపుణులు. వీలైతే బెల్ట్ ధరించడమ మానేయడమే ఉత్తమం అని వారు సలహా ఇస్తున్నారు.



Next Story

Most Viewed