మేయర్ ప్రేమ కోసం కుక్కలా పుడుతానంటున్న ఆర్జీవీ…

by  |
మేయర్ ప్రేమ కోసం కుక్కలా పుడుతానంటున్న ఆర్జీవీ…
X

దిశ, సినిమా : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన పెంపుడు కుక్కకు కుడిచేతితో చపాతీ తినిపిస్తూ.. ఎడమ చేతితో తను తింటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కాగా ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ కామెంట్స్ చేశారు ఆర్జీవీ. కుక్కపై మేయర్ ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుందన్న ఆర్జీవీ.. ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ ప్రజలపై ఒక్క శాతం కూడా లేదని అనిపిస్తుందని ట్వీట్ చేశారు. వీరందరు కూడా కుక్కను చూసి అసూయపడుతున్నారన్న వర్మ.. ఆమె కుక్క మీద ప్రేమతో తాగిందా లేక తాగిన కుక్కను లవ్ చేస్తుందా? అనే అనుమానం వస్తుందన్నారు. నిజం చెప్తున్నా ఈ వీడియో చూశాక మేయర్ ప్రేమ పొందేందుకు తర్వాతి జన్మలో కుక్కలా పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు ఆర్జీవీ. ఆమెను ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ డాగ్స్‌గా ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : కుడి చేతితో కుక్కకు.. ఎడమ చేతితో మేయర్..



Next Story

Most Viewed