ASHU తో RGV మరో అరాచకం.. సిగ్గు, మానం లేని ముసలోడికి దసరా పండగ

by  |
ASHU తో RGV  మరో అరాచకం.. సిగ్గు, మానం లేని ముసలోడికి దసరా పండగ
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లా జీవించడం ఎవరి వలన కాదని కొందరి వాదన.. ఛీ ఛీ అది కూడా ఒక జీవితమేనా అనేది మరికొందరి అభిప్రాయం. ఎవరు ఏం అనుకొంటే నాకెందుకు.. నా ఇష్టం.. నా జీవితం అన్నట్లు ముందుకెళ్ళిపోతున్నాడు వర్మ. అమ్మాయిలతో మందు, చిందు, వివాదం, కౌంటర్లు, వార్నింగ్లు, సెక్స్.. ప్రస్తుతం ఇవే వర్మ లైఫ్ లో ఉన్నాయి. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి రచ్చ చేసిన ఈ డైరెక్టర్ మరోసారి ఆమె బర్త్ డే పార్టీలో అరాచకం చేశాడు. మందేసి అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ దర్శనం ఇచ్చాడు. ఇక ఆ ఫోటోలను తాజాగా బర్త్ డే బ్యూటీ అషూరెడ్డి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి.

RGV : నీకే చెల్లింది.. ఒక పక్క అమ్మాయిలతో పార్టీలు.. మరోపక్క వివాదాస్పద బయోపిక్ లు

ఇక ఇటీవల బర్త్ డే చేసుకున్న అషూరెడ్డి ఆ పార్టీకి వర్మను పిలవడం ఆసక్తిగా మారింది. ఆర్జీవీ తో ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిలో పడిన ఈ భామ అందుకు కృతజ్ఞత గానే వర్మను పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటోలకు ఒక మంచి లైన్ కూడా రాసుకొచ్చింది. “జీవితంలో సరైన వ్యక్తులను కలిసినప్పుడు కృతజ్ఞత, గౌరవం డబుల్ అవుతాయని” చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే.. సిగ్గు,మానం లేని డగర్ లతో ఎంజాయ్ అని ఒక నెటిజన్ అనగా.. మరో నెటిజన్ సినిమా అవకాశం ఇస్తాను అన్నాడా..? అంతలా తిరిగేస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది మందులో ఉంటే వర్మ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు.. ఇక అమ్మాయిలు కూడా ఉంటే ఆయన్నెవ్వరు ఆపలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story