RGV : నీకే చెల్లింది.. ఒక పక్క అమ్మాయిలతో పార్టీలు.. మరోపక్క వివాదాస్పద బయోపిక్ లు

by  |

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచనాలకు పర్మినెంట్ అడ్రెస్స్. వర్మ ఏం మాట్లాడినా సంచలనమే.. ఏ సినిమా తీసినా వివాదమే. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి హీరోయిన్లను ప్రమోట్ చేసే పని పెట్టుకున్న వర్మను అభిమానులు మర్చిపోతున్నారేమో అనుకుంటున్న సమయంలో ఏదో ఒక కొత్త వివాదానికి తెరలేపి అమ్మో.. వర్మ మళ్లీ వచ్చేశాడు అని గుబులు రేపుతుంటాడు. ఇటీవల కాలంలో పార్టీలు, హీరోయిన్లు అంటూ రచ్చచేసిన వర్మ సీరియస్ అయ్యాడు. ఇప్పటికే రాజకీయ నేతల బయోపిక్ లను అవలీలగా తీసేసి, వివాదాల మధ్య విడుదల చేసి, నేతల గుండెల్లో గుబులు రేపి, అభిమానుల ముందుకు తీసుకొచ్చిన వర్మ తాజాగా మరో పెద్ద వివాదానికే తెరలేపాడు.

ఒక పక్క అమ్మాయిలతో పార్టీలు, మందు, చిందు అనుకుంటూ తిరిగిన వర్మ.. మరోపక్క సడెన్ గా వరంగల్ లో ప్రత్యేక్షమయ్యి షాక్ తినిపించాడు. ఎప్పుడు వోడ్కాలో మునిగి తేలుతూ, అమ్మాయిలతో చిందులు వేసే వర్మ సడెన్ గా మరో వివాదస్పద బయోపిక్ ని అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. వరంగల్ రాజకీయ ముఖ చిత్రంలో.. జిల్లా రాజకీయాల్లో అత్యంత కీలకంగా నిలిచిన కొండా మురళి.. కొండా సురేఖ పై బయోపిక్ తీస్తున్నానంటూ మరో బాంబ్ పేల్చాడు.. వీరి ప్రేమకథ.. కొండా మురళీ రాజకీయ జీవితం.. వారీ జీవితాల్లో జరిగిన నాటకీయ పరిణామాల గురించి వరంగల్ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకొంటారు. అలాంటి వారి బయోపిక్ అంటే మాటలు కాదు. ఇప్పటికే వంగవీటి, రక్తచరిత్ర లాంటి చిత్రాలతో రచ్చ చేసిన వర్మ మరో రక్తచరిత్రకు పునాది వేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు ‘కొండా’ అని టైటిల్ పెట్టి త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని ఆడియో ద్వారా తెలిపిన వర్మ.. ఆ ఆడియోలో కూడా సంచలన వ్యాఖ్యలే చేశాడు.

వరంగల్ రాజకీయాలు, నక్షలైట్లు, ఫ్యాక్షనిజం, నిజానిజాలు నిగ్గుతేలుస్తానంటూ చెప్పుకొంటూ వచ్చాడు. ప్రస్తుతం వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ అంతా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. మామూలుగానే సినిమాలో రచ్చ చేసే వర్మ.. ఇక బయోపిక్ లు అంటే ఇంకా ఊపేస్తాడు. అందుకు నిదర్శనం రక్తచరిత్ర అనే చెప్పాలి. అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనే లేదు. ప్రస్తుతం ఈ కొండా బయోపిక్ కూడా అంతే సంచలనం రేపేలా ఉందని చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇకపోతే బయోపిక్ కి తగ్గట్టే క్యాస్టింగ్ ఎంచుకునే వర్మ కొండా మురళి, సురేఖ పాత్రలను ఎవరితో చేయించనున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీంతో వర్మపై నెట్టింట్లో పలురకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎదైనా వర్మకే చెల్లుతోంది.. అమ్మాయిలతో మందేసి చిందేయలన్నా.. వివాదాలు తలకెత్తుకొనేలా బయోపిక్ లు తీయాలన్న ఆయన తర్వాతే అంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.ఏదిఏమైనా మరో వివాదానికి తెరలేపిన ఈ వివాదాస్పద దర్శకుడు ఈ సినిమా విడుదలయ్యేలోపు ఎన్ని వివాదాలను కొనితెచ్చుకుంటాడో చూడాలి.

ఆ సీక్రెట్ బయటపెట్టేసిన RGV .. ఈ సారి తెలంగాణ రక్తచరిత్ర అంటూ..

ASHU తో RGV మరో అరాచకం.. సిగ్గు, మానం లేని ముసలోడికి దసరా పండగ

RGV : డర్టీ కామెంట్స్ : ఆ హీరోయిన్ ని ఊహించుకోని 3వేల సార్లు ఆ పని చేశా

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed