ఒకేరోజు ఆ జిల్లాలో జగన్, బాలయ్య, లోకేష్ ప్రచారం.. ఏం జరుగబోతోంది?

by Indraja |
ఒకేరోజు ఆ జిల్లాలో జగన్, బాలయ్య, లోకేష్ ప్రచారం.. ఏం జరుగబోతోంది?
X

దిశ ప్రకాశం: ఈ నెల 30న ఉదయం 10 గంటలకు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారని సమాచారం. టంగుటూరులో ప్రచారం ముగిసిన తర్వాత కడప జిల్లా మైదుకూరు వెళ్ళనున్నారని తెలుస్తోంది. అయితే అదే రోజు సాయంత్రం 4 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒంగోలుకు రానున్నారని సమాచారం.

కాగా ఆయన ఒంగోలులో నిర్వహించనున్న యువజన సమావేశంలో పాల్గొంటారు. ఇక హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నేత నందమూరి బాలకృష్ణ మర్రిపూడిలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో 30వ తేదీన పాల్గొననున్నారని తెలుస్తోంది. ఒకే రోజు అటు అధికార పార్టీ అధినేత ఇటు టీడీపీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది.

ఇక వచ్చే నెల 9న టీడీపీ, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒంగోలులో నిర్వహించనున్న బహి రంగ సభలో పాల్గొననున్నట్లు సమాచారం.

Next Story