ఎన్నికలు వాయిదా వేయాలని నగరంలో పోస్టర్లు

by  |
ఎన్నికలు వాయిదా వేయాలని నగరంలో పోస్టర్లు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం త్వరలో నిర్వహించ తలపెట్టిన జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయాలని నగరంలో పలు చోట్ల వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఐసీఎంఆర్ సర్వే ప్రకారం దేశంలో మిలియన్ల ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని , వేలాది మంది మరణించారని, చలి కాలంలో కరోనా వైరస్ పెరిగే ప్రమాదముందని నీతి అయోగ్ హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేయాలంటూ కరపత్రాలు నగరంలోని సైదాబాద్, ఓల్డ్ మలక్ పేట ప్రాంతాల్లో దర్శన మిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రెండో దశ విజృంభిస్తోందని, ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని పోస్టర్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛా యుతంగా జరగాల్సిన ఎన్నికలను ఈ విపత్కర పరిస్థితుల్లో నిర్వహించడం సాధ్యం కాదని పోస్టర్ లో పేర్కొన్నారు. రాబోయే వేసవి వరకు కరోనా తీవ్రత తగ్గితేనే ఎన్నికలను నిర్వహించాలని పోస్టర్‌లో రాసి ఉండడం కన్పించింది.


Next Story

Most Viewed