చిరంజీవితో దండం పెట్టించుకుంటారా.. Jagan Mohan Reddy పై Pawan Kalyan సీరియస్ (వీడియో)

by GSrikanth |   (  Updated:2022-08-29 09:32:41  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవితో దండం పెట్టించుకుంటారా.. Jagan Mohan Reddy పై Pawan Kalyan సీరియస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు చెక్కులు అందజేసిన అనంతరం సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి పవన్ మట్లాడారు. ''ఒక బిజినెస్ మ్యాన్ నుండి భవన నిర్మాణ కార్మికుడు దాకా, సామాన్యుడు నుండి చిరంజీవి గారు దాకా.. అందర్నీ చేతులు కట్టుకుని ఉండాలి. మాకు ఎదురు తిరిగితే ఎంత పెద్ద మెగాస్టార్‌ని అయినా కింద కుర్చోపెడతాం అనే ఆలోచనా ధోరణి నాకు నచ్చలేదు. కొన్ని కోట్ల మంది ఆరాధించే, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న చిరంజీవి గారిని సీఎంకు దండం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత ఆధిపత్య ధోరణి ఉందో అర్ధం చేసుకోవచ్చు'' అంటూ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆ హీరో అంటే చాలా ఇష్టం: పీవీ సింధు

Next Story