'టీడీపీని Jr.NTR టేకోవర్ చేసుకోవాలి.. అదే నా కోరిక'

by Disha Web Desk 2 |
టీడీపీని Jr.NTR టేకోవర్ చేసుకోవాలి.. అదే నా కోరిక
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీరియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కోరారు. తన తాతగారు స్థాపించిన తెలుగు దేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ టేకోవర్ చేసుకోవాలని.. అదే తన చివరి కోరిక అని లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. కాగా, ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ కావడం రాజకీయ వర్గా్ల్లో దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ను బీజేపీ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోందని కొందరు వాదిస్తుంటే.. ఆ భేటీకి ప్రాధాన్యత లేదని, కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యే అమిత్ షా కలిశారని బీజేపీ శ్రేణలు క్లారిటీ ఇచ్చారు. ఈ పుకార్లంటికీ చెక్ పడాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సిందే.

దసరాకు బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ NBK-2'





Next Story

Most Viewed