- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
రాష్ట్రంలో బీజేపీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో పాత్ర ఉందంటూ నిన్న రాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీజేపీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో పాత్ర ఉందంటూ నిన్న రాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను అనంతరం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి వరంగల్ కోర్టుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ అరెస్ట్ వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిరసనకు దిగారు. బండి సంజయ్ ను వరంగల్ కు తరలిస్తుండగా పార్టీ కార్యకర్తలతో కలిసి రాజాసింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ న కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అంతకు ముందు బండి అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read more:






