KCR ఫ్యామిలీలో పొలిటికల్ వార్.. కవితను అడ్డుకుంటున్న KTR.!

by  |
KCR ఫ్యామిలీలో పొలిటికల్ వార్.. కవితను అడ్డుకుంటున్న KTR.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 24 గంటల వ్యవధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు మారిపోయారు. రాజ్యసభకు వెళ్తారని అందరూ భావించిన కేసీఆర్ కుమార్తె కవిత మళ్లీ మండలి మెట్లే ఎక్కనున్నారు. నిజామాబాద్​స్థానిక సంస్థల స్థానం నుంచి ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం నామినేషన్​దాఖలు చేస్తారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర మంత్రులను కలువడంతో పాటు కేసీఆర్​సతీమణి అనారోగ్యం దృష్ట్యా హస్తినకు వెళ్లిన సీఎం కుటుంబం అక్కడే రాజకీయాలపై కీలకంగా చర్చించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మధ్య జరిగిన చర్చల్లో కవితను రాష్ట్ర రాజకీయాల్లో కీలకం చేయాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం వరకు నిజామాబాద్​స్థానం నుంచి ఆకుల లలిత పేరు ప్రస్తావనలో ఉండగా.. ఒక్కసారిగా సీన్​మారిపోయింది.

ఏం చేస్తారో..?

సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అంశంలో ఇటీవల చర్చలు, ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిజామాబాద్‌లో ఓటమి తర్వాత పార్టీలో క్రియాశీలకంగా కనిపించలేదు. దీంతో అనేక రకాల ప్రచారం జరిగింది. పార్టీలో, ప్రభుత్వంలో చిన్నచిన్న పదవులు ఇవ్వలేక, అత్యంత కీలకమైన బాధ్యత ఏది అప్పజెప్తే బాగుంటుందో అర్థం కాక కేసీఆర్ మల్లగుల్లాలు పడినట్లు పార్టీ వర్గాల్లో టాక్. వాస్తవానికి దాదాపు రెండేండ్లు కవిత సైలెంట్ కాగా.. తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. ఈ విషయంలో కేసీఆర్​కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం కూడా జరిగింది.

మండలితో మళ్లీ తెరపైకి..!

రెండేండ్ల కిందట వచ్చిన నిజామాబాద్​స్థానిక మండలి ఎన్నికల్లో కవితను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. భారీ మెజార్టీతో కవిత గెలిచారు. అప్పటికే కవితకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం ప్రగతిభవన్ నుంచే సాగింది. కానీ మంత్రి పదవి మాత్రం కవితకు దక్కలేదు. అప్పటికే కేబినెట్‌లో సీఎంతో పాటు పద్దెనిమిది మంది మంత్రులున్నారు. ఆ పరిణామాల్లో ఎవరినీ తప్పించలేక కవితకు అవకాశం ఇవ్వలేదంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి కవిత పదవీ కాలం కేవలం 14 నెలలు మాత్రమే. దీంతో కేబినెట్‌లో మార్పులేమీ జరుగలేదు.

సెంట్రల్‌కు వెళ్లేదేలే..

వాస్తవానికి ఎంపీగా ఐదేండ్లు పని చేసిన కవిత.. మళ్లీ రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటులో అడుగుపెడుతారనే అంశం తెరపైకి వచ్చింది. దీనికి అనుగుణంగానే రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్‌ను మండలిలోకి తీసుకున్నారు. కవిత కోసమే ఆ స్థానాన్ని ఖాళీ చేయించారని పార్టీ వర్గాల్లోనూ ప్రచారం జరిగింది. కానీ, కవిత మాత్రం కేంద్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదంటున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా తండ్రిపై అలిగారనే చర్చ కూడా సాగింది. కీలక సమయాల్లో ఆమె ప్రగతిభవన్‌కు దూరంగా ఉన్నారు. రాఖీ పండుగ రోజు యూఎస్‌లో ఉన్న ఆమె ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు గ్రీటింగ్స్ చెప్పినా ఆయన రిప్లై ఇవ్వలేదు. మరోవైపు టీఆర్ఎస్​ప్లీనరీకీ దూరంగానే ఉంటూ వచ్చారు. కేంద్ర వైఖరిపై ఇటీవల టీఆర్ఎస్​పార్టీ రెండుసార్లు నిరసనలకు పిలుపునివ్వగా.. రాష్ట్రమంతా జరిగిన ధర్నాల్లోనూ పాల్గొనలేదు. కానీ హైదరాబాద్‌లో జరిగిన మహాధర్నాకు హాజరయ్యారు. ఇక్కడ కూడా కేటీఆర్‌తో ఎడమోహం.. పెడమోహంగానే వ్యవహరించారు.

ఢిల్లీలో అసలు కథ..

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఊహించని పరిణామాలు జరిగాయి. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో గల కేసీఆర్ నివాసంలో కుటుంబ రాద్ధాంతం జరిగిందని తెలుస్తున్నది. సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరిగాయంటున్నారు. రాజ్యసభ ఎంపీగాసెంట్రల్‌కు వెళ్లేందుకు కవిత ససేమిరా ఒప్పుకోలేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, తనకు కేబినెట్‌లో స్థానం కల్పించాలన్న కవిత వాదనకు కేటీఆర్ అడ్డు చెప్పారని సమాచారం. ఈ సమయంలో వాగ్వాదం చోటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరిని సముదాయించడంలో కేసీఆర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చివరకు కవితను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ స్థానం నుంచి ఆకుల లలితను తప్పించి కవితను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారని పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు.

కేబినెట్‌లోకి ఎంట్రీ?

వాస్తవానికి ఇప్పటికే కవిత ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. కీలకంగా మాత్రం వ్యవహరించడం లేదు. ప్రగతిభవన్‌లో కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాలంటే కచ్చితంగా కేబినెట్‌లో కొలువుదీరాలని భావిస్తున్నట్టు తెలిసింది. కవిత కోసం ఎవరికైనా ఉద్వాసన పలుకాల్సిందే. ఎంతమంది ఉన్నా.. తమకు అనవసరమనే ధోరణితో ఉంటే మాత్రం ఈటల స్థానాన్ని కవితతో భర్తీ చేయాల్సిందే. కానీ, ఇప్పటికే ఆ స్థానం బండా ప్రకాష్‌కు వస్తుందని పార్టీలో ప్రచారం సాగుతున్నది. ఇప్పుడు కవిత రీ ఎంట్రీతో.. కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న వాళ్లందరి నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లయింది.

పోటీకి విపక్షాలు దూరం.. నిజామాబాద్ లో కవిత ఏకగ్రీవం..?


Next Story

Most Viewed