బయటకు లాగి తంతా.. పవన్ సంచలన వ్యాఖ్యలు

by  |
బయటకు లాగి తంతా.. పవన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీతో పెట్టుకుంటే కాలిపోతారు.. మమ్మలను తిడితే ఊరుకుంటారనుకోవొద్దు బయటకి లాగి తంతాం అని గట్టిగా హెచ్చరించారు.

ఇంకా కోమాలోనే సాయిధరమ్ తేజ్..

సాయిధరమ్‌ తేజ్‌ ఇంకా కోమాలోనే ఉన్నారని..కళ్లు తెరవలేదని వెల్లడించారు. సాయితేజ్‌ ఆసుపత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి తాను హాజరైనట్లు చెప్పుకొచ్చారు. ‘‘సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైతే అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ తేజ్‌ ఆక్సిడెంట్‌‌పై కొందరు చేసిన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిడెంట్ అయిన వ్యక్తి కోలుకోవాలని కోరుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా నడుపుతున్నాడని లేనిపోని కథనాలు అల్లారని విమర్శించారు. సమాజంలో చాలా సమస్యలున్నాయని వాటి మీద మాట్లాడాలని హితవు పలికారు. ఈ సందర్భంగా మీడియాపైనా సెటైర్లు వేశారు. మీడియా బాధ్యతాయుతమైన కథనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు? కోడికత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనక భారీ కుట్ర ఉంది. ఆరేళ్ల చిన్నారిపై అమానుషం ఇలాంటి వాటిపై కథనాలు ఇవ్వాలని సూచించారు. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలన్నారు. ‘మేం మనుషులమే, మా మీద కొంచెం కనికరం చూపించండి.

ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు..ఇండియన్ రిపబ్లిక్

రిపబ్లిక్‌ సినిమాను దేవకట్టా సామాజిక స్పృహతో తీసిన సినిమా. ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా అని తెలుస్తోంది. దేవకట్ట గారి కృషి కనిపిస్తోంది. ఇది వైసీపీ రిపబ్లిక్‌ కాదు.. ఇండియన్‌ రిపబ్లిక్‌. ఇది వైసీపీ రిపబ్లిక్‌ అంటే జనం తిరగబడతారు. సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవు. సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి. సినిమా పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తా. సినిమా వాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడంలేదు. నాతొ గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా. గుండాలకు భయపడితే మనం బతకలేం. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది బతుకుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

సినిమా మేం చేస్తే..మీరు వ్యాపారం చేస్తారా..?

‘సినిమా వారు వ్యాపారం చేసుకోకూడదా. సినిమా బడ్జెట్ చిన్నది కావొచ్చు ప్రభావం పెద్దది. వకీల్ సాబ్ సినిమా లేకుంటే ఆంధ్ర ప్రదేశ్లో సినిమాలు రిలీజ్ అయి ఉండేవి. కులం చూసి బంధాలు పెంచుకోలేదు. వ్యక్తిత్వాన్ని చూసి పెంచుకున్నా. సినిమా మేము తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా. అమ్మడానికి మీరు ఎవరు’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘సినిమా పరిశ్రమ సున్నితమైంది. పవన్ కల్యాణ్ పై కోపం మీద లక్ష మంది సినీ కార్మికుల పొట్ట కొడుతున్నారు. నా పై కోపం ఉంటే నా సినిమాలు ఆపండి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉప రాష్ట్రపతి పైనే దాడులు చేసిన జగన్‌కు సినిమా వాళ్ళు ఒక లెక్కా’ అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ఫై గొడవ పడడానికి సిద్దమయ్యా అందుకే మాట్లాడుతున్నా. నాపై కోపాన్ని సినీ ఇండస్ట్రీపై చూపడం సరికాదని పవన్ జగన్ సర్కార్‌ను హెచ్చరించారు.

మోహన్‌బాబుపై చురకలు

ఏపీలో సినిమా టికెట్లను తామే విక్రయిస్తామన్న ప్రభుత్వం.. రేపు మోహన్‌బాబు విద్యా సంస్థలను మేమే నడుపుతామని అనొచ్చు. మోహన్‌బాబు కాలేజీని జాతీయం చేయోచ్చు. జగన్ సర్కార్‌లో ఖజానా ఖాళీ అయినందుకే సినిమా టికెట్లను సర్కార్ విక్రయించి దాంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందే ప్లాన్ చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో సినిమా హాలున్నాయి.. ఆంధ్రలో లేవు. చిత్ర పరిశ్రమను హింసించ వద్దని మోహన్‌బాబు వైసీపీ నాయకులకు చెప్పండి. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు పన్నులు కడుతున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పవన్ సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమపై మీ వైఖరి మారక పోతే ఆంధ్రాలో సర్కార్‌ను ఎలా మార్చాలో తమకు బాగా తెలుసునన్నారు. చిత్ర పరిశ్రమను జగన్ ఏమీ చేయలేరని పవన్ గట్టిగా చెప్పారు.

పవన్ కల్యాణ్ పనికిమాలిన స్టార్.. పేకాట ఆడేందుకు తప్ప దేనికీ పనికిరాడు


Next Story

Most Viewed