పవన్ కల్యాణ్ పనికిమాలిన స్టార్.. పేకాట ఆడేందుకు తప్ప దేనికీ పనికిరాడు

by  |
పవన్ కల్యాణ్ పనికిమాలిన స్టార్.. పేకాట ఆడేందుకు తప్ప దేనికీ పనికిరాడు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పనికిమాలిన స్టార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కల్యాణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొచ్చారు. చిరంజీవి, నాగార్జున లాంటి సినీపెద్దలు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని.. దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెల్లడించారు. బ్లాక్ టికెట్లని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించడం తప్పా అని ప్రశ్నించారు.

టికెట్ల విక్రయాలకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తే పవన్‌కు వచ్చిన నష్టమేంటో చెప్పాలని నిలదీశారు. అంతేకాదు పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘పావలా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య దూరం పెంచేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ విమర్శలు చేశారు. నీవు అడ్డంగా కోట్లు సంపాదించుకోవాలి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల త‌ర‌ఫున డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కల్యాణ్. జ‌న‌సేన పార్టీ విజయవాడ కార్పొరేషన్‌లో ఒక్క సీటు కూడా గెలవలేద‌ు.

పవన్ క‌ల్యాణ్‌ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట కూడా గెలవలేక పోయాడు. ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చోటు లేదని తెలిసిపోయింది. చిరంజీవి లేకపోతే పవన్ జీరో. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫామ్ హౌస్‌లో కూర్చుని పేకాట ఆడ‌డానికి తప్ప దేనికీ పనికి రాడ‌ంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి ప‌వన్ అంటూ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా ప్రజలే పవన్ తాట తీశారు. సినీ ‌పరిశ్రమలో దోపిడీని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్న సీఎం జగన్‌పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు.

బయటకు లాగి తంతా.. పవన్ సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed