రోశయ్య మరణం తెలుగువారికి తీరని లోటు : పవన్ కళ్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-12-04 00:58:40  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రోశయ్య మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తున్నానని అన్నారు. నాకు సన్నిహిత సంబంధాలు ఉన్న రోశయ్య మరణం నన్ను వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య మృతికి తన తరఫున, జనసేన తరఫున సంతాపం [&hellip;]</p>

రోశయ్య మరణం తెలుగువారికి తీరని లోటు : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రోశయ్య మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తున్నానని అన్నారు. నాకు సన్నిహిత సంబంధాలు ఉన్న రోశయ్య మరణం నన్ను వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య మృతికి తన తరఫున, జనసేన తరఫున సంతాపం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ.. వారికి భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు.

రోశయ్య మరణంతో తెలుగుజాతి గొప్ప నాయకుడిని కోల్పోయింది: బాలకృష్ణ

Next Story