- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోశయ్య మరణంతో తెలుగుజాతి గొప్ప నాయకుడిని కోల్పోయింది: బాలకృష్ణ
<p>దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హఠాన్మరణం పట్ల హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ‘‘సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు. అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రిగా రోశయ్య పేరొందారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. రోశయ్య మృతితో గొప్ప అనుభవంగల నాయకుడిని తెలుగు జాతి కోల్పోయింది. కంచు కంఠం, నిండైన రూపం, పంచెకట్టుతో తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవారు’ అని రోశయ్య కుటుంబ సభ్యులకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హఠాన్మరణం పట్ల హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ‘‘సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు. అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రిగా రోశయ్య పేరొందారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. రోశయ్య మృతితో గొప్ప అనుభవంగల నాయకుడిని తెలుగు జాతి కోల్పోయింది. కంచు కంఠం, నిండైన రూపం, పంచెకట్టుతో తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవారు’ అని రోశయ్య కుటుంబ సభ్యులకు బాలకృష్ణ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎందరో ముఖ్యమంత్రులు మారినా రోశయ్య నిశ్చలంగా ప్రజాసేవే తన పరమావధిగా విధులు నిర్వహించేవారని, అటువంటి మహనీయుడు మరణించడం మన దురదృష్టకరమని బాలయ్య అన్నారు.
- Tags
- balakrishna
Next Story






