ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ వన్‌గా టాలీవుడ్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-02-06 12:59:25  IST  )

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ వన్‌గా టాలీవుడ్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఆయన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) సినిమాతో మన ముందుకు వచ్చాడు. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు.

సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన తొలి వారం నుంచే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగించింది. అలా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శన పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిజిటల్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ సినిమా ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సాధారణంగా పెద్ద స్టార్ సినిమాలు లేదా భారీ బడ్జెట్ చిత్రాలకే ఓటీటీలో ఈ స్థాయి ఆదరణ దక్కుతుంటుంది.

అయితే ఒక మీడియం రేంజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇంత తక్కువ సమయంలో టాప్ పొజిషన్‌కు చేరుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేస్తూ వెల్లడించారు. ‘ప్రైమ్ వీడియో ఇన్‌లో సంక్రాంతి విజేత ఇప్పుడు మీ OTTలో విజయవంతంగా రన్ అవుతోంది.. నారినారి నడుమ మురారి పై ప్రేమ పెరుగుతూనే ఉంది’ అని రాసుకొచ్చారు. కాగా ఓటీటీలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం వల్ల అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Rajasaab OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన 'రాజాసాబ్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Next Story