Robin Hood OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-05 13:04:24  IST  )

యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్.

Robin Hood OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్, షిజు, మైమ్ గోపీ, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో రిలీజైన రాబిన్ హుడ్ కు మొదటి నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆ టాక్ అలాగే కంటిన్యూ అయ్యింది. దీంతో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు.

ఇదిలా ఉంటే.. రాబిన్ హుడ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ హక్కులను జీ5, జీ5 తెలుగు సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ సినిమా టీవీ ప్రీమియర్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్‌లో ప్రసారం కానుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మాత్రం వెల్లడించలేదు. కానీ, అదే టైమ్‌కి ఓటీటీలోనూ రాబిన్ హుడ్ ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Click For Tweet..

Read More..

Nithin: థియేటర్స్‌లోకి రాబోతున్న నితిన్ ‘తమ్ముడు’.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేస్తూ మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట...

Next Story