- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nithin: థియేటర్స్‌లోకి రాబోతున్న నితిన్ ‘తమ్ముడు’.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేస్తూ మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(thammudu).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(thammudu). పవన్ కళ్యాణ్ హిట్ సినిమాతో పేరుతో రాబోతుండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సప్తమి గౌడ(Sapthami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. లయ (laya) కీలక పాత్రలో కనిపించబోతుంది. అజనీస్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.
అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు షూటింగ్ పూర్తి కానందున కాస్త సమయం పడుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూలై-4న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ నితిన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో నితిన్ నోట్లో కత్తి పెట్టుకుని వైల్డ్ లుక్‌లో కనిపించాడు. ఈ పోస్ట్‌కు ‘‘ఒక ప్రతిష్టాత్మకమైన.. శక్తివంతమైన గాథ బిగ్ స్క్రీన్‌లను వెలిగిస్తుంది. యాక్షన్, భావోద్వేగం అన్నింటిని ఒకే స్క్రీన్‌పై చూసి గొప్ప అనుభూతి చెందండి. తమ్ముడు జూలై 4, 2025న బుల్సేయ్‌ని తాకుతున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు.






