‘గామి’ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్పుడే.. అధికారిక ప్రకటన విడుదల చేసిన జీ5 పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
‘గామి’ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్పుడే.. అధికారిక ప్రకటన విడుదల చేసిన జీ5 పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘గామి’. దీనిని డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెరకెక్కించగా.. మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో విశ్వక్ అఘోర గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాకుండా గామి కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.

అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులకు ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఇక అప్పటి నుంచి స్ట్రీమింగ్ తేదీపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, నేడు జీ5 సంస్థ గామి ఓటీటీ పై వచ్చే రూమర్లకు చెక్ పెడుతూ స్ట్రీమింగ్ తేదిని ప్రకటిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఏప్రిల్ 12న గామి ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Read More..

ఆ హీరోయిన్‌తో డేటింగ్‌‌పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉన్ని ముకుందన్!



Next Story